Niharika Konidela: ఆ ఒక్క ఫోటో మినహా అన్ని ఫోటోలు డిలీట్ చేసిన నిహారిక.. ఏమైందంటే?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా నిహారిక గురించి విడాకుల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ విషయంపై మెగా డాటర్ కానీ లేదా మెగా ఫ్యామిలీ గాని ఏ విధంగానూ స్పందించలేదు. ఇకపోతే వీరి వ్యవహార శైలి చూస్తుంటే విడాకులు పక్క అనే విషయం అర్థం అవుతుంది. నిహారిక చైతన్య గత కొంతకాలంగా ఇద్దరు కలిసి జంటగా ఎక్కడ కనిపించలేదు.

ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక వెంకట చైతన్య నిహారికతో పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నిటిని కూడా డిలీట్ చేశారు. ఇలా పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందించలేదు అయితే తాజాగా నిహారిక చేసిన పని చూస్తే మాత్రం ఇద్దరూ పక్క విడాకులు తీసుకోబోతున్నారని అర్థమవుతుంది.

నిహారిక కూడా తన భర్త నాగచైతన్య బాటలోనే పయనిస్తూ ఆమె కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.ఈ విధంగా నిహారిక కూడా పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో నిజంగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.విడాకుల గురించి నిహారిక ఇలా హింట్ ఇచ్చారా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేసిన నిహారిక ఒక్క ఫోటోను మాత్రం అలాగే ఉంచింది.

 

పెళ్లి మండపంలో చైతన్య నిహారిక ఇద్దరు పక్కపక్కనే ఉన్నటువంటి ఫోటోను ఈమె అలాగే ఉంచింది. అయితే ఇందులో చైతన్య ఫేస్ మొత్తం బ్లర్ అయి ఉంది. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె.. తన వద్ద ఓ రహస్యం ఉందని అయితే అది అందరికీ చెబితే సీక్రెట్ ఎలా అవుతుంది సారీయే చెప్పలేను అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. ఇలా పెళ్లి ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసి ఒక్క ఫోటో మాత్రమే ఈమె పెట్టడంతో నిహారిక నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారంటూ అందరూ భావిస్తున్నారు అయితే కొందరు ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఒక్క ఫోటో కూడా ఎందుకు ఉంచడం దీన్ని కూడా డిలీట్ చేసేయ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -