Niharika Konidela: నిహారిక సంచలన వ్యాఖ్యలు.. చైతో మాట్లాడలేదంటూనే?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య గురించి రోజు ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది. ఈ వార్తలకు అనుగుణంగా వీరి వ్యవహార శైలి కూడా అలాగే ఉండడంతో మరింత అనుమానాలను రేకేతిస్తున్నాయి.నిహారిక వెంకటచైతన్య ఇద్దరు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో వీరి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం ఒక కారణం.

ఇక వెంకటచైతన్య గత కొద్ది రోజులుగా ఎక్కడ కూడా మెగా కుటుంబంతో కలిసి వేడుకలలో పాల్గొనలేదు. అలాగే నిహారిక కూడా వెకేషన్ కి వెళ్ళిన తన స్నేహితులతో కలిసి వెళ్తున్నారు తప్ప తన భర్తతో కలిసి ఎక్కడ కనిపించలేదు. ఇక ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నిహారిక విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై మౌనంగా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నిహారిక చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గతంలో వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నిహారిక తాను చైతన్యతో ఆ టైంలో అసలు మాట్లాడలేదంటూ తెలియజేశారు. చైతన్య నిహారికకు కొత్త సంబంధం అనే విషయం మనకు తెలిసిందే.

చైతన్య తండ్రి గారితో చిరంజీవికి ఉన్నటువంటి అనుబంధం కారణంగా వీరి పెళ్లిని నిర్ణయించారు. అయితే చైతన్య ఫ్యామిలీ తనకు కొత్త కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి గురించి మాట్లాడుకున్న చైతన్య నీహారిక మాత్రం మాట్లాడుకోవడం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతనే ఇద్దరం కలుసుకొని మాట్లాడామని ఈ సందర్భంగా నిహారిక వెంకట చైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -