Nilgiri Constituency: నగరి నియోజకవర్గం రివ్యూ.. రోజాకు ఓటమి తప్పదట.. ఆమెకు ఏడుపే మిగిలిందా?

Nilgiri Constituency ఆంధ్రప్రదేశ్లో సెలబ్రిటీ నియోజకవర్గాలలో నగరి నియోజకవర్గ ఒకటని చెప్పాలి. నియోజకవర్గం నుంచి సినీ నటి రోజా ఎమ్మెల్యేగా గెలపొందారు. 2014 -19 ఎన్నికలలో రోజా నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇలా రెండుసార్లు అక్కడ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రోజా మూడోసారి కూడా నగరి నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి కూడా ఈమె ఎమ్మెల్యేగా అధికారం అందుకుంటారా లేదా అన్న విషయంపై ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.

నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కొనసాగటం అక్కడ సొంత పార్టీ వారికే ఇష్టం లేదని తెలుస్తుంది గత ఆరు నెలల నుంచి రోజాకు టికెట్ కూడా ఇవ్వకూడదని స్థానిక నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు కానీ తనకు టికెట్ ఇవ్వకపోతే తన నోటి దూల కారణంగా పార్టీకి మొదటికే మోసం వస్తుందన్న ఒక్క కారణంతోనే ఆమెకు మంత్రి పదవి అలాగే ప్రస్తుత ఎన్నికలలో టికెట్ ఇవ్వడం జరిగింది.

నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల వైసీపీ నాయకులు ఎవరు కూడా రోజాకు మద్దతు లేరు. వారంతా కూడా రోజుకు వ్యతిరేకంగా మారారు. ఇలా ఈమెకు వ్యతిరేకత ఏర్పడటానికి కారణం లేకపోలేదు. మండలాలలో ఉన్నటువంటి నాయకులతో రోజా ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడిన దాఖలాలు లేదు. అలాగే తన నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి చేసిన దాఖలాలు ఏమాత్రం లేవని చెప్పాలి.

తన ఇద్దరి సోదరులను ముందు పెట్టి ఈమె వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇలా ఈ ఐదేళ్ల కాలంలో రోజా వందల కోట్లు అవినీతి ద్వారా సంపాదించిందన్న ఆరోపణలు నగరి నియోజక వర్గం మొత్తం ఆమెకు వ్యతిరేకంగా మార్చేలా చేసింది. ఈ విధంగా రోజా పూర్తిస్థాయిలో నెగిటివిటీ ఎదుర్కోవడమే కాకుండా ఈమెను ఓడించాలన్న పథకాన్ని కూడా మంత్రిపెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఒక వ్యూహం రచించారని తెలుస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ఓటమికి కూడా కారణమవుతున్నారని తనని వ్యతిరేకిస్తున్న వారందరికీ ఈయన మద్దతు తెలుపుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి నియోజకవర్గంలో ఈసారి రోజాకు ఓటమి తప్ప గెలుపు లేదని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -