Jagan Reddy: జ‌గ‌న్‌రెడ్డికి ఢిల్లీలో నో అపాయింట్మెంట్‌.. ఏపీలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Jagan Reddy: ఏపీ రోజురోజుకీ అప్పుల ఊబిలో మరింత కూరుకుపోతోంది. అలాగే ఏపీకి కావలసిన అప్పులు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. అయితే ఆ మేర‌కు అప్పులు పుట్ట‌డం లేదు. దీంతో సీఎం రోజు రోజుకు క‌ష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇచ్చిన అప్పుల పరిమితిని వంద రోజుల్లో ఊదేసి అదనపు అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు. దాంతో ఇప్పటికే మోటార్లకు మీటర్లు పెట్టానని సిపిఎస్ రద్దు చేయకుండా కొనసాగిస్తున్నానని కేంద్రం చెప్పిన సంస్కరణలు అన్ని అమలు చేస్తున్నానని సీఎం చెబుతున్న కూడా అప్పులు పుట్టని పరిస్థితి.

ఇకపోతే తెరవెనక కార్పొరేషన్ల రుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని అప్పులు ఇస్తామని అనుకుంటున్నారో కానీ కేంద్రం ఇటీవల కాస్త నట్లు బిగిస్తున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లి విధేయత ప్రదర్శించి కాస్త అప్పులకు అవకాశం తెచ్చుకోబోతున్నారన్న వార్తలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే గత వారం రోజులుగా జగన్ టీమ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తోంది. జగన్ అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్న ఇంకా సానుకూల ఫలితం రానట్టు తెలుస్తోంది. అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని తెలుస్తోంది.

 

అమిత్ షా అపాయింట్మెంట్ కావాలని ప్రభుత్వం తరఫున తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా అటు నుంచి సానుకూల‌త రావటం లేదు. మరోవైపు దేశ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. దీంతో బిజెపి ఏపీలో తన స్టాండ్ ఎలా ? మార్చుకోబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -