Jagan Reddy: రెడ్లను మార్చలేని నిస్సహాయ స్థితిలో జగన్.. రెడ్డి కులంపై ఎంత ప్రేమో అంటూ?

Jagan Reddy: సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు.. పేద వర్గాలకు రాజకీయంగా అందలం.. ఇవన్నీ జగన్ తరుచూ చెప్పే మాటలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నామని చెబుతూ ఉంటారు. బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం మీద కూర్చొపెట్టిన ఘనత తమదేనని చెప్పుకుంటారు. బీసీలు, ఎస్సీలు, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చానని డంకా మోగిస్తారు. అయితే.. సమాజిక న్యాయం విషయంలో జగన్ చిత్తశుద్ది చాలా సార్లు రుజువైంది. ఎందుకంటే.. అన్ని వర్గాలకు పదవులు ఇచ్చారు కానీ.. పదవికి ఉన్న పవర్ కట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. వారి పేర్లు కూడా ప్రజలకు తెలియదు. ఏపీలో ఉపముఖ్యమంత్రి పదవికి అంత గుర్తింపు ఉంటుంది. ఉపముఖ్యమంత్రి పదవుల గురించి పక్కన పెడితే మంత్రిత్వ శాఖల విషయంలో కూడా అంతే. పేరుకే మంత్రులు కానీ.. ఆయా శాఖకు సంబంధించిన అన్ని పవర్స్ సీఎం దగ్గరే ఉంటాయి. వాటిపై ప్రెస్ మీట్ పెట్టాలంటే సజ్జల రామకృష్ణరెడ్డి ముందుకు వస్తారు తప్పా సంబంధిత మంత్రులు మాట్లడే పరిస్థితి లేదు.

కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఐటీ మంత్రిగా గుడివాడ, కీలకమైన నీటిపారుదల శాఖ అంబటి చేతిలో ఉన్నాయి. వీరిద్దరు కూడా పవన్ కల్యాణ్ ని విమర్శించడానికి తప్పా.. ఆయా శాఖలపై ప్రెస్ మీట్లు పెట్టింది లేదు. అందుకే.. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే.. కోడి, గుడ్డు, పొదగాలి అని సంబంధం లేని సమాధానం చెప్పి అమర్నాథ్ నవ్వుల పాలైయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది అని ప్రశ్నిస్తే ఏమో నాకు తెలియదు అని దౌర్బాగ్యమైన సమాధానం చెప్పారు. నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ ఉదాహరణ మాత్రమే. అన్ని శాఖల పరిస్థితి ఇంతే. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని అంబటి రాంబాబు చెప్పడంలో అర్థం లేకపోలేదు. నిజంగానే దానికి సంబంధించిన విషయాలు ఆయనకు తెలియదు. ఏమైనా తెలిస్తే.. సీఎం జగన్‌కు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియాలి. ఇలా మంత్రి పదవులను ఇచ్చి వాటి పవర్స్ తీసుకోవడం జగన్ స్టైల్. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ గా వైసీపీ చెప్పుకుంటుంది.

వైసీపీ చివరి జాబితా అభ్యర్థులు పేర్లను ప్రకటించింది. మొత్తం వైసీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. రెడ్లకే పెద్ద పీట వేశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 స్థానాలు ఉన్నాయి. అందులో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీలపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో ఇవి చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులతో జగన్ బంతాట ఆడారు. తొలి జాబితా విడుదలైనప్పటి నుంచి రిజర్వుడు స్థానాల్లోనే ఎక్కువగా సిట్టింగులకు షాక్ ఇచ్చారు. సిట్టింగులు స్థానాల్లో కొత్తవారిని ప్రకటించారు. కానీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల స్థానాలు మాత్రం మార్చలేదు. పార్టీలో ఎవరికైతే సీటు రాదు.. రాకూడదని ఇంటా బయట నిరసనలు హోరెత్తాయో జగన్ వారికే సీట్లు కేటాయించారు. రోజా, అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జగన్ మాత్రం వారి జోలికి వెళ్లలేదు. జగన్ ప్రతాపం మొత్తం ఎస్టీ, ఎస్సీ రిజర్వుడు స్థానాలపైనే చూపించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -