Jagan Reddy: ఆ ఛానెళ్ల రిపోర్టర్లకు పదవులు.. జగన్ రెడ్డికి వాళ్లపై ఎంత ప్రేమో?

Jagan Reddy: చింత చచ్చినా.. పులుపు చావలేదని అంటారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ తీరు అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఉన్నదారులన్నీ మూసుకుపోయాయి. అలా పోటీ చేయకూడదని కాదు.. గెలుపునకు ప్రయత్నించకూడదని కాదు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిన్న మొన్న అధికారంలోకి వచ్చినట్టు మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది చాలా పొరపాటు.

 

ఎన్నికలకు ముందు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన వైసీపీలో కనిపించడం లేదు. గెలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్వాలేదు. కానీ, ఎన్నికల ముందు నామినేటడ్ పోస్టుల నియామకంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. లేదంటే ఈ సోషల్ మీడియా యుగంలో చిన్న తప్పు జరిగినా చాలా వేగంగా వార్త బయటకు వస్తుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. ఏపీ సమాచార కమిషనర్ పోస్టును ఎన్టీవీకి చెందిన రిపోర్టర్ రెహానాకు కట్టబెట్టారు. సొంత మీడియాతో పాటు.. మరికొన్ని మీడియా సంస్థలు జగన్ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు వార్తలు రాస్తూ ఉంటాయి. అలాంటి వారికి పదవుల రూపంలో తాయిలాలు అందిస్తున్నారు. కానీ, ఇది సమయం కాదు.

 

అసలు సమాచార కమిషనర్ అంటే.. చాలా పెద్ద పోస్టు. నిబంధనల ప్రకారం చాలా విషయాల్లో అత్యంత నిపుణులైన వారిని ఆ పోస్టులో కూర్చోపెట్టాలి. అంతేకాదు.. సమాచార కమిషనర్ ఎంపికకు ఓ పద్దతి ఉంటుంది. ప్రతిపక్షనేతతో కూడిన కమిటీ సమాచార కమిషనర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు విజయవాడలో లేని టైంటో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మీటింగ్ కు రావాలని ఆయనకు కబురు పెట్టారు. రెండు వారాల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చంద్రబాబు తెలిపారు. కానీ, కమిటీలో కీలక వ్యక్తిగా ఉన్న ప్రతిపక్షనేత మాటను బేఖాతరు చేశారు. ఆగమేఘాల మీద రెహానను ఆర్టీఐ కమిషనర్ గా నియమించారు.

 

ఆర్టీఐ కమీషనర్ కు ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన జీతభత్యాలు ఉంటాయి. అంటే.. అది ఎంత బాధ్యతాయుతమైన పోస్టు అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి పదవి నియమకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఆలోచించాలి. ఎన్నికలకు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం ఓట్లర్లను ఆకర్షించడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ, దానికి రూల్స్ ఫాలో అవ్వాలి కదా? అనే ప్రశ్నలు వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది.

 

ఓ టీవీ రిపోర్టర్ కు ఆర్టీఐ కమిషన్ గా నియమించారు అంటే.. ఆమె వైసీపీకి అనుకూలంగా ఏ స్థాయిలో పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ, మీడియా సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పార్టీనలు గెలిపించరు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుస్తామనే విషయాన్ని రాజకీయ పార్టీలు గ్రహిస్తే అది అందరికీ మంచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -