Pawan Kalyan: ఆ అమ్మాయి పెళ్లికి డబ్బులిచ్చిన పవన్.. గ్రేట్ కదా?

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పవర్ స్టార్ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఆయనో గొప్ప వ్యక్తిత్వం అని ఆయన అభిమానులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం సినిమాలతో పాటు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా పవన్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

 

పేదల పట్ల ఎప్పుడూ దయతో, సాయం కావాల్సిన వాళ్లకు ఎప్పుడూ సాయం చేసే మనస్తత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. ఎదుటి వాళ్లు తనకు తిరిగి సహాయం చేయలేరు అని తెలిసినా కూడా చేసేది సహాయం అని నమ్మే పవన్ కళ్యాణ్.. ఎన్నో గుప్త దానాలు చేశాడు. అయితే ఆయన ఏనాడు.. నేను పలానా చేశానని చెప్పుకోలేదు కానీ ఆ సాయం పొందిన వాళ్లు మాత్రం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు.

పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఓ సాయం గురించి తాజాగా తెలుగు యాక్టర్ సమ్మెట గాంధీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ ది ఎంతో గొప్ప మనసు అని పొగిడిన ఆయన.. పవన్ గుప్త దానాలు చాలా చేశాడని వివరించాడు. నటి పావలా శ్యామలకు హార్ట్ సర్జరీ జరిగినప్పుడు డబ్బు సాయం చేసినట్లు ఆమె తనతో స్వయంగా చెప్పిందని సమ్మెట గాంధీ వివరించాడు.

 

పవన్ కళ్యాణ్ సినిమాలో పని చేసిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. తన కూతురి పెళ్లి కార్డును ఇవ్వబోతే సాయంత్రం వెళ్లేటప్పుడు కలవాలని పవన్ చెప్పాడని సమ్మెట గాంధీ వివరించాడు. సాయంత్రం ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళితే.. లక్ష రూపాయలు చేతిలో పెట్టి పంపించినట్లు సమ్మెట గాంధీ తెలిపాడు. కాగా పవన్ ఇలాంటి దానాలు ఎన్నో చేశాడని, ఎంతోమందికి ఆయన అండగా నిలిచాడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -