Pawan Kalyan: పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Pawan Kalyan: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఎప్పుడూ వార్తల్లో సెన్సెషనల్‌గా నిలుస్తుంటారు. ఆయన చెప్పింది చెప్పినట్లు చాలా వరకు జరిగాయి. దాంతో ఆయన మంచి పాపురాలిటీని సంపాదించుకున్నాడు. సెలబ్రిటీలు సైతం తమ భవిష్యత్ తెలుసుకోవడానికి ఆయన దగ్గర క్యూ కడుతుంటారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆయన దగ్గర జాతకాలు చెప్పించుకుంటారు. జాతకాల్లో ఏమైనా దోషాలు ఉంటే.. ఆయన చెప్పిన సలహాలు పాటిస్తూ పూజలు కూడా చేస్తారు. గతంలో రష్మిక కెరీర్ డ్రాప్‌లో ఉన్నప్పుడు వేణు స్వామిని కలిసిందట. ఆయన చెప్పినట్లు పూజలు చేసిన తర్వాత.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అలాగే గతంలో నాగచైతన్య-సమంత పెళ్లిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సమంత-నాగచైతన్య పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత.. వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అప్పటినుంచి ఆయన మరింత పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి స్టార్ హీరో హీరోయిన్ల కెరీర్, లైఫ్, పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి కూతురు శ్రీజ జాతకాల గురించి మాట్లాడారు. ఈ మాటలు ప్రస్తుతం పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. వీరిద్దరి జాతకం ఒకేలా ఉందని, పెళ్లిళ్ల విషయంలో వీరిద్దరూ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని వేణుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం.. నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటాడని వేణు స్వామి అన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, త్వరలోనే మరో పెళ్లి చేసుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే బాబాయి పవన్ కళ్యాణ్ లాగే.. శ్రీజ జాతకం ఉందన్నారు. ఈమె కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందన్నారు. మరో రెండు, మూడు నెలల్లో శ్రీజ తన స్నేహితుడ్ని పెళ్లి చేసుకుందన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న పలువురు షాక్‌కు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -