Pawan Record: రిలీజ్‌కు ముందే పవన్ ఖాతాలో రికార్డులు చేరుతున్నాయా?

Pawan Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. 17వ శతాబ్దపు పీరియాడిక్ వార్ డ్రామాగా పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు లీక్ అయ్యాయి. నెట్టింట ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కార్డ్ పడే వరకూ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ఎపిసోడ్‌గా ఉండేలా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్‌తో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవల్‌లో హిట్ కొడతాడో? లేదా? వేచి చూడాలి.

 

కాగా, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం.రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ అనుకూలంగా షూటింగ్ పూర్తి చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ హక్కులకు ఏకంగా రూ.700 కోట్ల ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమాకు ఆఫర్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్‌కు హరిహర వీరమల్లు మేకర్స్ ఓకే చెప్తారో? లేదో? వేచి చూడాలి. కానీ, ఈ సినిమా థ్రియేటికల్ రైట్స్ భారీగా పలకడంతో ఫ్యాన్స్ మాత్రం తెగ సంతోష పడుతున్నారు. ఏ హీరోకి లేని రికార్డు.. పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిందని సంబరపడిపోతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడని వేడుకలు జరుపుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -