Pawan Kalyan: ఎమ్మెల్సీ ఫలితాలపై నోరు విప్పిన పవన్.. ఇకపై ఓట్లు చీలవంటూ?

Pawan Kalyan: ఏపీలో పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా ఉన్న ఎన్నికల్లో వైసీపీ చతికిల పడింది. దీంతో వై నాటు 175 కి బూడిద వేసినట్లు అయ్యింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన చీఫ్‌ ధ్వజమెత్తారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయంటూ ఒక ప్రకటన విడుదల చేశారు పవన్‌ కల్యాణ్‌.

 

అధికారం తలకెక్కిన వైసీసీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు సరైన దారి చూపారు.రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న ప్రభుత్వం తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు.ఈ ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు’ అని పేర్కొన్నారు పవన్‌.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -