Pawan Kalyan: పిఠాపురంలో వైసీపీ చేతులు ఎత్తేసిందా.. పవన్ గెలుపు నల్లేరుపై నడకేనా?

Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి చూపు కేవలం పిఠాపురం రాజకీయాలపైనే ఉంది పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే అందుకు కారణం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా పిఠాపురంలో ఓడించాలన్న ఉద్దేశంతో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముద్రగడ్డ పద్మనాభం, ఎంపీ మిధున్ రెడ్డి వంటి వారిని రంగంలోకి దింపారు. అయితే వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తుంది. వైసిపి విజయం అసాధ్యమని తెలిసినటువంటి ముద్రగడ మిథున్ రెడ్డి పిఠాపురాన్ని గాలికి వదిలేసారు. ఇక మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటన చేస్తూ ఉన్నారు.

మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ రాకపోవడంతో ఆయన స్వయంగా జనసేనకు మద్దతు తెలపాలని తన అనుచరులకు చెప్పినట్టు వైసిపిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక గీత సైతం నామమాత్రంగానే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా పిఠాపురంలో వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

జనసేన పిఠాపురం ఇన్ చార్జ్ మకినీడి శేషు కుమారి వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన ఆమెకు 28 వేల ఓట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత శేషు కుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. ఇలా వైసిపి నేతలందరూ కూడా పిఠాపురం విషయంలో వెనుకడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ని విజయానికి రూట్ క్లియర్ అయిందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -