Poonam Pandey: రూ.100 కోట్ల జరిమానా కట్టడానికి పూనమ్ పాండే అంగీకరిస్తారా?

Poonam Pandey: పూనమ్ పాండే పరిచయం అవసరం లేని పేరు ఇటీవల కాలంలో తన ఇంస్టాగ్రామ్ ద్వారా చనిపోయారు అంటూ ఆమె స్వయంగా పోస్ట్ చేసుకుని పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చేసిన సినిమాల కంటే తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారానే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచేవారు. గతంలో ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇటీవల గర్భాశయ క్యాన్సర్ తో తాను మరణించాను అంటూ స్వయంగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో నిజమేనని అందరూ కూడా ఈమె మృత్తిపై స్పందించారు. కానీ మరుసటి రోజు తాను బ్రతికే ఉన్నానని చనిపోలేదంటూ మరొక వీడియోని షేర్ చేశారు. కేవలం గర్భాశయ క్యాన్సర్ పట్ల అందరిలో అవగాహన కల్పించడం కోసమే తాను ఇలా చేశానని ఈమె చెప్పుకు వచ్చారు. దీంతో ఎంతోమంది ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరికొందరు ఈమెపై కేసు నమోదు చేయాలి అటువంటి డిమాండ్స్ కూడా వ్యక్తం చేశారు అయితే తాజాగా పూనమ్ పాండే తన భర్త పై కాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. ఫైజాన్ అనార్సి అనే వ్యక్తి ఈమె ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఎంతోమంది నమ్మకాలను వమ్ము చేసిందని ఈమెపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన భర్త పట్ల కూడా ఫిర్యాదు చేస్తూ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చెల్లించాలంటూ పేర్కొన్నారు. మరి ఈమె పై కేసు నమోదు చేశారనే విషయం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇలా ఈ ఘటన ద్వారా ఈమెకు బుద్ధి వస్తుందా ఇకపై ఇలాంటివి చేయకుండా ఉంటారా అంటూ మరికొందరు కామెంట్లు చేయగా 100 కోట్ల పరువు నష్టం ధావన్ వీళ్లు అంగీకరిస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -