Poonam Pandey: పూనమ్ పాండేకు భారీ షాక్ తగిలిందిగా.. అసలేం జరిగిందంటే?

Poonam Pandey: పూనం పాండే ఫిబ్రవరి 2న క్యాన్సర్ తో చనిపోయిందని తప్పుడు వార్తలు పుట్టించింది. పూనం సోషల్ మీడియా ఎకౌంట్ నుంచే ఈ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అయితే మరుసటి రోజే అది ఫేక్ న్యూస్ అని తెలిపింది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఇలా చేశాను అని చెప్పింది పూనం. అయితే ఈ సంఘటన మీద చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది పూనం . ఏకంగా తాను చనిపోయాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరిని పిచ్చోళ్లను చేయటంతో ప్రజలు ఈమెను రకరకాలుగా విమర్శిస్తున్నారు. సినీనటి కస్తూరి ఈమె నిజంగానే పోతే బాగుండు అంటూ పబ్లిక్ గానే కామెంట్ పెట్టింది.

 

ఒక జర్నలిస్ట్ మరొక అడుగు ముందుకు వేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనం పాండే మరణం పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు బాధ్యులు అందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఇలాంటి నకిలీ వార్తలను అరికట్టాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా పూనం పాండే చర్యను ఖండిస్తున్నారు. పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందని ఫేక్ న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో ఆమె అభిమానులలో ఆందోళన నెలకొంది.

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ నివాళులు సైతం అర్పించారు. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అని తెలిసిన ప్రజలు నివ్వెరపోయారు. గర్భాసయముఖద్వారం ద్వారా కలిగే క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు పూనం పాండే తన మరణం గురించి తప్పుడు వార్తలు పుట్టించింది. ఉద్దేశం మంచిదే అయినా ఆమె ఎంచుకున్న మార్గం సరిగ్గా లేదని విమర్శల పాలయింది.

 

అలాగే అలీ కాషిఫ్ అనే లాయర్ కూడా పూనం పాండే పై, ఆమె మేనేజర్ నికిత శర్మ పై మీడియాను సినీ పరిశ్రమను తప్పుకో తప్పుతో పట్టించారు కాబట్టి వారికి తగిన శిక్ష విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూనం పాండే ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -