Yandamuri Veerendranath: వైరల్ అవుతున్న ప్రముఖ రచయిత యండమూరి షాకింగ్ కామెంట్స్!

Yandamuri Veerendranath: ప్రముఖ నవల రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన నవలలను రచించడమే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథను కూడా అందించిన ఘనత యండమూరి గారికి ఉందని చెప్పాలి. ఇలా యండమూరి అందించిన కథలు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ మధ్యకాలంలో యండమూరి ఎన్నో మోటివేషనల్ స్పీచ్ల ద్వారా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సినిమాల గురించి కూడా ఆయన తన ధోరణిలో సినిమాలకు విశ్లేషణ ఇస్తున్నారు. తాను రచించిన కథ డైరెక్టర్ చేతికి వెళ్లిన తర్వాత ఆ కథలో ఎలాంటి మార్పులు చేసుకుంటారనేది డైరెక్టర్ హీరో ఇష్టమని అంతేకానీ ఆ కథ నాది ఇలాగే ఉండాలి అని నేను ఆ సినిమా విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అంటూ తెలిపారు.

 

ఇక పలువురు డైరెక్టర్లు చేసిన సినిమాలు డిజాస్టర్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది డైరెక్టర్లను తప్పు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే యండమూరి చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది అంటే అందులో డైరెక్టర్ తప్పు ఏమాత్రం లేదని తెలిపారు.చిరంజీవిని ప్రేక్షకులు ఒక నక్సలైట్ గా చూడడం జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా ప్రేక్షకులకు కావాల్సిన అంశం ఏదో సినిమాలో మిస్సయింది.

 

ఇలా ప్రేక్షకుల కావాల్సిన అంశం మిస్ కావడంతోనే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందని కానీ ఈ సినిమా విషయంలో కొరటాల తప్పు ఏమాత్రం లేదని తెలిపారు. అంతకుముందు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేసిన కొరటాల అదే రీతిన ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేసి ఉంటారు.ఇక త్రివిక్రమ్ కూడా ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారో మనకు తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఆ తప్పు త్రివిక్రమ్ ది కాదని ఈ సందర్భంగా ఈ సినిమాల ఫ్లాప్ విషయంలో డైరెక్టర్లది తప్పు లేదంటూ యండమూరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -