Ram Charan: రామ్ చరణ్ మొహం గురించి కాంట్రవర్షియల్ కామెంట్ చేసిన ఆ వ్యక్తి!

Ram Charan: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ నట వారసుడు రామ్ చరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఎంతో అభిమానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక తన అద్భుతమైన నటనతో ప్రత్యేకమైన మేనరిజానికి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. అలా పలు సినిమాల్లో నటించి మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినీ అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు.

ఇదంతా పక్కన పెడితే యండమూరి వీరేంద్రనాథ్ హీరో రామ్ చరణ్ గురించి ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. మెగాస్టార్ తండ్రి అయ్యాడని.. వెంటనే కొడుకు రామ్ చరణ్ పుట్టాడని, దాంతో మెగాస్టార్ భార్య తన కొడుకుని హీరో చేయమని అడిగిందట. ఇక రామ్ చరణ్ దవడ కింద కొంచెం బాగోదట. ఆ విషయంలో రామ్ చరణ్ కి సర్జరీ చేయించి మగధీర సినిమా తీపించారు అంటూ ఒక వివాదాసస్పద కామెంట్ చేశాడు యండమూరి.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. ఈ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ యండమూరి మాటలను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కామెంట్ల రూపంలో ఒక రేంజ్ లో యండమూరిని ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.సి 15 సినిమా షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి యండమూరి మాటల గురించి చరణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -