Pawan Kalyan: పవన్ కళ్యాణ్ లో ఉన్న ఏడు గొప్ప లక్షణాలివే.. ఒకే ఒక్క హీరో అంటూ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. హీరోగా పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో వ్యక్తిగతంగా ఆయన ఆటిట్యూడ్ నచ్చి అభిమానించే అభిమానులు సైతం అదే స్థాయిలో ఉన్నారు. అయితే కొన్ని విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తం ఇతరుల కోసం ఖర్చు చేసే హీరోలలో పవన్ ముందువరసలో ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ లో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏడు లక్షణాల గురించి అభిమానుల మధ్య ప్రధానంగా చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారంటే పలు సందర్భాల్లో ఆయన రెమ్యునరేషన్ ను సైతం త్యాగం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు.

సాధారణంగా రాజకీయ నాయకులు అంటే అవినీతికి పాల్పడతారని ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు ఖర్చు చేస్తారని టాక్ ఉంది. అయితే పవన్ మాత్రం 2019 ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండానే పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా పవన్ కళ్యాణ్ విలువలకు కట్టుబడి ఉన్నారు. అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చిందని తెలిసినా స్పందించే విషయంలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు.

నిర్మాతలు సినిమాల వల్ల నష్టపోయిన సమయంలో పవన్ రెమ్యునరేషన్లలో కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పొగడ్తలకు పొంగిపోకుండా విమర్శలకు కృంగిపోకుండా సాధారణ జీవితాన్ని గడపటానికి ఇష్టపడే అసాధారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పే డైలాగ్ ఉంటుంది. అయితే నిజ జీవితంలో కూడా పవన్ సినిమాల్లో, రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేశారు. ఎన్నికల్లో పవన్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీనే సక్సెస్ సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందంటే పవన్ రేంజ్ ఏంటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -