Lakshmi Devi: లక్ష్మీదేవి పాదాలకు పూజ చేస్తే అంత అరిష్టమా.. అలా చేస్తే పాపం తగులుతుందా?

Lakshmi Devi: చాలామంది నారాయణడి పాదాలని పూజించవచ్చు కానీ లక్ష్మీదేవి పాదాలని పూజించకూడదు అంటారు. నిజానికి అది ఒక మూఢనమ్మకం మాత్రమే ఎలాంటి ప్రామాణిక గ్రంధాలలోనూ లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అని రాసి లేదు. వాస్తవానికి పరమేశ్వరి పరమేశ్వరుడు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ అంతా ఒకటే కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదాలని అర్చించవచ్చు.

అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్లిన మరి ఇంకే అమ్మవారి క్షేత్రానికి వెళ్లిన అమ్మకి నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు సెఠారి శిరస్సుపై ఉంచుతారు. మనం తలవంచి నమస్కారం చేస్తాం ఆ సెఠారి మీద అమ్మవారి పాదాలే ఉంటాయి. పరమాత్మ మనం మార్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ ఉంటే పాదాలని దర్శిస్తే చాలు పరమాత్మనే దర్శించినట్టే.

 

అటువంటి భావంతో అయ్యవారి కైనా అమ్మవారి కైనా పాదాలకు నమస్కరించవలసిందే. నిజానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు చంచలాయై నమః పాదవ్ పూజయామి అంటూ సర్వాంగాలను పూజ చేస్తాను కదా మరి పాదాలను పూజ చేయకుండా ఎలా ఉంటాం. కాబట్టి ఎలాంటి మూఢనమ్మకం పెట్టుకోకుండా లక్ష్మీదేవికి పాదపూజ చేసుకోవచ్చు. నిజానికి బలి చక్రవర్తి కూడా వామానుడి పాదాలను జలముతో తన భార్య అయినా వింధ్యావళి నీళ్లు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇస్తాడు.

 

ఆ స్వామి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ పాదంతోనే ఆక్రమిస్తాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవ పాదాన్ని బలి చక్రవర్తి శిరస్సున ఉంచుతాడు. కాబట్టి అటువంటి భగవంతుడి పాదములని మనం ఆశ్రయించాలి. పేరుకే అయ్యవారు అమ్మవారు కానీ నిజానికి అందరూ ఒక్కటే. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్టే ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా పాదపద్మాలకు నమస్కరించవలసిందే.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -