Swapna Dutt: వైరల్ అవుతున్న నిర్మాత స్వప్నాదత్ సంచలన వ్యాఖ్యలు!

Swapna Dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి.ఇలా తెలుగులో ఎన్నో నిర్మాణ సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాయి ఇలాంటి వాటిలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్వినీ దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన తాను సినిమాలకు దూరం అవుదామని అనుకుంటున్న తరుణంలో ఆయన కుమార్తెలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా సినిమాలపై ఉన్న పిచ్చితో అశ్విని దత్ కుమార్తెలకు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.ఇకపోతే అశ్విని కుమార్తె స్వప్న దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సొంతంగా స్వప్న బ్యానర్స్ అని ఒక నిర్మాణ సంస్థను స్థాపించి వైజయంతి మూవీస్ బ్యానర్ తో కలిసి ఈమె సినిమాలను నిర్మిస్తూ తన ఏంటో నిరూపించుకుంటున్నారు. సినిమా అంటే ఎంతో అభిరుచి కలిగినటువంటి స్వప్న వద్దకు ఎన్నో సినిమాలు వెళ్తుంటాయి.

ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు మాత్రమే ఈమె తెరకెక్కిస్తూ ఉండగా మరికొన్ని సినిమాలు కొన్ని కారణాలవల్ల వదిలేసుకుంటారు. అయితే ఇలా వదిలేసుకున్న సినిమాల వల్ల తాను బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు.ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాని వదులుకొని తాను ఇప్పటికీ బాధపడుతున్నానని స్వప్న దత్ వెల్లడించారు. ఇక ఈ సినిమా ముందు తన వద్దకు వెళ్లిందని కథ బాగా నచ్చింది ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని భావించిన స్వప్న ఈ సినిమా చేయాలని భావించారట.

అయితే కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైన సినిమాని తన నిర్మాణంలో నిర్మించలేకపోయాను అనే బాధ ఇప్పటికీ తనని కలిచి వేస్తుందని స్వప్న దత్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నిర్మాణంలో వచ్చినటువంటి మహానటి, సీతారామం, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయో మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -