Tollywood: టాలీవుడ్ సినిమాలు ప్రూవ్ చేస్తోంది ఇదే.. అలా ఉంటేనే సినిమాలు హిట్టా?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్రలు చాలా సాఫ్ట్ గా ఉండేలా దర్శకులు వారి పాత్రలను తీర్చిదిద్దుతారు.ఇక ఈ మధ్యకాలంలో హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన డాన్స్ చేయడం అలాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం కోసం మాత్రమే హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నారన్న భావన కలుగుతుంది.

ఇలా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే ఇందులో దాదాపు 8 సినిమాలలో హీరోయిన్స్ పాత్ర ఇలాగే ఉండబోతోంది అయితే ప్రస్తుత కాలంలో దర్శక నిర్మాతలు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా హీరోయిన్ల పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో హీరోయిన్లనే విలన్ గా చూపించడం జరుగుతుంది.అదేవిధంగా కొన్ని సినిమాలలో హీరోయిన్ల క్యారెక్టర్ కాస్త నెగటివ్ స్టేట్స్ లో చూపించడం వల్ల సినిమాలు మంచి సక్సెస్ అవుతున్నాయి.

 

ఇకపోతే ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ శారీరక సుఖం కోసం ఒక అబ్బాయితో గడపడం అనంతరం మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. ఇలాంటి సన్నివేశాలను చూసి ఒక్కసారిగా ప్రేక్షకులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమాల్లో కూడా హీరోయిన్ ఇలాంటి పాత్రలో కాకపోయినా నెగటివ్ పాత్రలో చూపించారు.

 

ఇలా విరూపాక్ష సినిమాలో చివరికి హీరోయిన్ విలన్ అనే విషయం తెలిసి అందరూ కూడా ఈ సినిమాలో ట్విస్ట్ అదిరిపోయిందని ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఇక తాజాగా వచ్చిన బేబీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఇదే తరహాలో ఉంటుంది ఇందులో కూడా ఈమె ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మరొక అబ్బాయితో కూడా లవ్ ట్రాక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలా హీరోయిన్స్ క్యారెక్టర్ కాస్త బ్యాడ్ వేలో చూపిస్తుంటే సినిమాలు హిట్ అవుతున్నాయని పలువురు ఈ సినిమాలను ఉదాహరణగా చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -