Arjun Reddy: అర్జున్ రెడ్డిపై నిర్మాత స్వప్న కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Arjun Reddy: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొంది మంచి సక్సెస్ అందుకున్న సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తం మారిపోయిందని చెప్పాలి. అయితే ఈ సినిమా పూర్తిగా బోల్డ్ కంటెంట్, బూతు డైలాగులతో తెరకెక్కగా ఆ సమయంలో ఈ సినిమా బాగా వివాదంలో చిక్కుకుంది. చాలామంది ఈ సినిమా పై బాగా విమర్శలు చేశారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఈ సినిమా ఉందని బాగా విమర్శించారు.

 

అయితే సినిమా అలా ఉంటుందనే ఈ సినిమాను నిర్మించలేకపోయాను అని నిర్మాత స్వప్న దత్ తాజాగా కొన్ని విషయాలు బయట పెట్టింది. తనకు అర్జున్ రెడ్డి సినిమా కథ నచ్చిన, సినిమా నిర్మించాలని ఆశపడిన.. ధైర్యం చాలక నిర్మించలేకపోయాను అని తెలిపింది. అర్జున్ రెడ్డి స్టోరీ తనకు ఎంతగానో నచ్చింది అని.. ఆ సినిమాను నిర్మించాలని బాగా ఆశపడ్డాను అని తెలిపింది.

కానీ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆ సినిమాను నిర్మించలేకపోయాను.. ఆ సమయంలో ధైర్యం చేయలేకపోయాను అంటూ.. ఒకవేళ ఆ సినిమా తేడా కొడితే.. ఛీ ఛీ ఒక ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా అని అంటారని భయపడ్డాను అని.. అందుకే రిస్క్ చేయలేక పక్కకు తప్పుకున్నాను అంటూ.. కానీ ఇప్పుడు అందుకు బాధపడుతున్నాను అని తెలిపింది.

 

ఇక పెళ్లి చూపుల సినిమాపై గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది. ఆ సినిమా పై తను ఆసక్తి చూపలేదు అని అందుకే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను అని.. ఇక జీవితంలో తను ఎన్నో ఎత్తు పల్లాలు చూసానని.. పరాజయం పొందడం వల్లే ఇప్పుడు విజయం రుచి మరింత తెలిసిందని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -