YSRCP Siddham: సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రజల్ని ఈ రేంజ్ లో టార్చర్ చేయాలా జగన్?

YSRCP Siddham:  రాప్తాడు సభ ఫుల్ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు తెగ మురిసిపోతున్నారు. ఇక సోషల్ మీడియలో అయితే వారి ఆనందానికి హద్దే లేదు. నిజానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సభలకు కూడా జనం వస్తున్నారు. ఆ జనాన్ని చూసి సభ సక్సస్ అనుకుంటే పొరుపాటే. అంతెందుకు నిన్నకాక మొన్న ఏపీలో అడుగుపెట్టిన షర్మిలకు కూడా ఊకపోస్తే ఊకరాలనంత జనం వస్తున్నారు. అంత మాత్రానా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాకు రాలేం కదా? జనం ఎలా వస్తున్నారు? ఎందుకు వస్తున్నారనేది ముఖ్యం. రాప్తాడు సభకు జనం బాగానే వచ్చారు. కానీ, ఎలా వచ్చారు? ఎలా రప్పించారు అనేది చాలా ఇంపార్టెంట్.

ఈ సభకు జనాలను రప్పించడానికి నానా తంటాలు పడ్డారు. సభకు వచ్చేవారికి రూ. 500, మందు, మాంసం భోజనం ఆఫర్ చేశారు. అయితే, ఆ డబ్బు ఆఫర్ ను చాలా మంది నమ్మలేదు. వైసీపీ పథకాలులాగే.. మొదట మాటిచ్చి.. తర్వాత హ్యాండిస్తారని జనానికి తెలుసు. అందుకే మాకు నమ్మకం లేదు దొర.. ముందు ఇవ్వాలని చాలా మంది నిలదీశారు. తర్వాత ఇస్తామని చెప్పి.. బస్సులు ఎక్కించారు. అయితే.. కొంతమంది బస్సులు కదలనివ్వలేదు. డబ్బులు ఇస్తే కానీ కదిలేది లేదని తేల్చి చెప్పారు. మరికొంతమంది బస్సులను మధ్యలోనే నిలిపివేశారు. మొత్తానికి ఏదోలా సభకు జనాలను తరలించారు. 500, చికెన్ భోజనం, మందు ఇచ్చి అంతమందిని తెప్పించుకున్నారు. ఇలా డబ్బు ఇచ్చి జనాన్ని తరలించడానికి ఏకంగా 3వేల ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు ఏర్పాటు చేశారు. దీంతో.. సామాన్య ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బస్ డిపోలు ఖాళీ అయ్యారు. దీంతో.. ప్రయాణాల కోసం డిపోలకు వచ్చిన వారు ఖంగుతిన్నారు. అసలే ఎండలు. ఈ ఎండల్లో అత్యవసరానికో.. మరో పని కోసమో.. డిపోలకు వస్తే.. అక్కడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దీంతో.. సభను సక్సెస్ చేసుకుంటున్నామంటున్న వారికి అసలు నిజం తెలియడం లేదు. ప్రతిపక్షాలు సభలు పెట్టుకుంటే.. తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలు.. తమ సభలకు ఆర్టీసీ బస్సులను తరలించి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు… ఇంత కష్టపడి డబ్బు, మందు ఇచ్చి తరలిస్తే ఆ జనం ఏమైనా ఎక్కువ టైం ఉంటున్నారా? అంటే అదీ లేదు. జగన్ రాకముందు నుంచే జంప్ అయిపోతున్నారు. దీంతో.. డబ్బుంత వృధా అయిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇంత ఖర్చు చేస్తే.. షెడ్యూల్ వచ్చే సరికి ఆర్థిక వనరులు కరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది? ఎక్కడ నుంచి డబ్బు తీసుకొని రావాలి అని సతమతమవుతున్నారు. కొంతమంది అయితే.. ఎలాగూ ఓడిపోతామని సర్వేలు వస్తున్నాయి కనుక సైలెంట్ గా ఉంటడం మంచిదని అనుకుంటున్నారట. మొత్తానికి సిద్దం సభలతో దేనికి సిద్దమో ఇప్పుడిప్పుడే పార్టీనేతలకు అర్థం అవుతుందట. ఆర్థికంగా దివాళా తీయడానికి తప్ప గెలవడానికి సిద్దం కాలేమని అర్థం చేసుకుంటున్నారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -