YSRCP Siddham: బస్సు ఎక్కితే రూ.500, మందు, మాంసం.. రాప్తాడు జగన్ సభ వెనుక ఇంత జరిగిందా?

YSRCP Siddham:  సైకిల్ బయటుండాలి.. గ్లాస్ సింకులో ఉండాలి.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని రాప్తాడులో జగన్ పంచ్ డైలాగులు వేశారు. స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో కానీ.. ఈ మధ్య జగన్ గట్టిగానే పంచులు పేల్చుతున్నారు. మొన్న షర్టు మడతబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. అయితే, చంద్రబాబు.. అంతకు మించిన ఉత్సాహంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు కుర్చీ మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కౌంటర్ వేశారు. అయితే, రాప్తాడులో కూడా స్క్రిప్టుకు తగ్గట్టు పంచ్ డైలాగులు పేల్చే ప్రయత్నం చేశారు. డైలాగులకు ఏముంది? ఎన్నికల టైంలో ఇలాంటి పంచులు, కౌంటర్లు కామనే. కానీ, జగన్ రాప్తాడు సిద్ధం సభకు జనం భారీగా వచ్చారు. అయితే, దీని కోసం స్థానిక నేతలు ఎంత కష్టపడ్డారో చెబుతుంటే పగవాడికి కూడా కన్నీళ్లు రాక మానవు.

ఈ సభకు జనాలను రప్పించడానికి కూడా వైసీపీ నేతలు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారు. జగన్ మీద అభిమానం ఉన్నవాళ్లు ఎలాగూ సభలకు హాజరవుతారు. కానీ.. అయిష్టంగా ఉన్నవారిని కూడా రప్పించాలి. డ్రోన్ల కెమెరాలతో తీసిన వీడియోలు తర్వాత వైరల్ చేసుకోవాలి. కాబట్టి.. లెక్కకు మించి జనం రావాల్సిందేనని అధిష్టానం హుకుం జారీ చేసింది. దీంతో.. స్థానికనేతల ప్రజలను తరలించడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. సభకు వచ్చేవారికి రూ. 500, మందు, మాంసం భోజనం ఆఫర్ చేశారు. అయితే, మాకు నమ్మకం లేదు దొర.. ముందు ఇవ్వాలని చాలా మంది నిలదీశారు. తర్వాత ఇస్తామని చెప్పి.. బస్సులు ఎక్కించారు. కొంతమంది బస్సులు కదలనివ్వలేదు. డబ్బులు ఇస్తే కానీ కదిలేది లేదని తేల్చి చెప్పారు. మరికొంతమంది బస్సులను మధ్యలోనే నిలిపివేశారు. మొత్తానికి ఏదోలా సభకు జనాలను తరలిస్తే.. డబ్బులు అందుకున్న వాళ్లు జగన్ రాక ముందే నెమ్మదిగా జారుకున్నారు. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు.

500 ఇచ్చి ఐదు నిమిషాలు కూడా కాకముందే జనం వెళ్లిపోవడంతో పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఈ మాత్రందానికి ఇంత ఖర్చు దేనికి అని అనుకుంటున్నారు. అంతేకాదు.. అధినేత తీరుపై కీలక నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. యాత్ర సినిమాకి మనమే టికెట్లు కొనాలి, సభలకు ఇప్పటి నుంచే డబ్బు పంచాలి అంటే ఎలా అని లోలోపల ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్ కూడా రాలేదు. ఇప్పుడే ఇంత ఖర్చు అయితే.. ముందు ముందు ఇంక ఎలా ఉంటుందో? అధినేత సభలతో సరిపోతుందా? అభ్యర్థు సొంతగా పర్యటించినపుడు మరింతగా ఖర్చు చేయాలి. ఇవ్వని ఆలోచిస్తే ఎన్నికలకు ఆస్తులు అమ్ముకోవడమే మార్గంలా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -