Raghu Rama Krishnam Raju: పిఠాపురంలో ప‌వ‌న్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ.. రఘురామ లెక్కలు నిజమవుతాయా?

Raghu Rama Krishnam Raju: పిఠాపురంలో జనసేన తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అంటూ రఘురామకృష్ణం రాజు జోస్యం చెప్పారు. ఇటీవల తెదేపాలోకి వచ్చినటువంటి ఈయన ఉగాది పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలో నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమాలలో ఈయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ తాను పిఠాపురంలో సర్వే చేయించారని ఆ సర్వేలో భాగంగా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు సర్వే ఫలితాలు వచ్చాయని తెలియజేశారు. అందరూ అన్నట్లు పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో కాకపోయినా 65 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా అస్వస్థత గురి కావడం తనని ఎంతగానో కలిచి వేసిందని ఈయన తెలిపారు. ఎంత మంది రెడ్లు వ‌చ్చినా.. ప‌వ‌న్‌ను ఓడించ‌డం సాధ్యం కాద‌న్నారు. సాక్ష‌త్తూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చి ఇక్క‌డ కూర్చున్నా.. ప‌వ‌న్ ఓట‌మి అనే మాట వినిపించ‌ద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ అరాచకపు పాలన పోవాలని ప్రతి ఒక్క కాపు నాయకుడు కోరుకుంటున్నారని కాపులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం అదే కోరుకుంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

నేను చెప్పే ఈ మాటలు నిజమవుతాయని అవసరమైతే రాసి పెట్టుకోమంటూ రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఇక‌, త‌న‌కు చంద్ర‌బాబు ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆదేశించినా శిర‌సా వ‌హిస్తాన‌ని ర‌ఘురామ తెలిపారు. అసెంబ్లీ అయినా.. చ‌ట్ట‌స‌బే క‌దా.. అని ప్ర‌శ్నించారు. ఇక ఈయన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -