Ranveer Singh-MS Dhoni: ఎంఎస్‌ ధోనీ కి ముద్దు పెట్టిన రణ్వీర్ సింగ్.. ఆ నటుడు తేడా అంటూ కామెంట్లు రావడంతో?

Ranveer Singh-MS Dhoni:  మామూలుగా సెలబ్రిటీలు పెద్ద పెద్ద వ్యక్తులు కలిసినప్పుడు ఒకరినొకరు హగ్ చేసుకోవడం షేక్ హ్యాండ్ ఇవ్వడం అన్నది కామన్. ఇలా చేసుకున్నప్పుడు కొంతమంది వారి మధ్య ఉన్న అతి చనువుతో ముద్దులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. తాజాగాటీమ్ ఇండియన్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీని ఘాడంగా ముద్దు పెట్టాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్. ఇప్పుడు అదే తప్పు అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రణ్ వీర్ సింగ్ తేడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఈమధ్యనే థోనీ సినిమా రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనె వీరు కలవడం పెద్ద టాపిక్ అయ్యింది. అలాగే ధోనీ బుగ్గపై రణ్‌వీర్‌ ముద్దు పెట్టడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. అయితే వీరి మీటింగ్స్ కు సబంధించిన ఫోటోలు బాలీవుడ్ రణ్‌వీర్‌ సింగ్ ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు. అంతే కాదు ఈ ఫొటోలకు మేరే మహీ.. అంటూ క్యాప్షన్‌ ని కూడా జోడించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా యాక్టీవ్ అవుతున్న మహేంద్ర సింగ్ థోనీ సినిమా స్థార్స్ తో అనుబంధం పెంచుకుంటున్నారు. ఆమధ్య టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ కూడా మహీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో ధోనీని కలిశారు. వీరిద్దరూ ఒక యాడ్ షూట్ కోసం క‌లుసుకున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ధోనీ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. స్టయిలిష్‌ లుక్‌తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అటుహెయిర్ స్టైల్ తో పాటు ఫేస్ లో కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే ధోని కు రణ్ వీర్ సింగ్ ముద్దు పెట్టడంతో రన్వీర్ సింగ్ తేడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -