Dhoni: బౌలర్‌కు క్లాస్ పీకిన ధోనీ.. రిపీట్ చేయవద్దంటూ సీరియస్

Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కెప్టెన్ కూల్ గా పేరుంది. ధోనీ చాలా కూల్ గా కనిపిస్తాడు. గ్రౌండ్‌లో ఎలాంటి టెన్షన్, ఒత్తిడి, భావోద్వేగాలను బయటపెట్టడు. ఎంత ఒత్తిడి ఉన్నా, మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నా మొఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా కూల్ గా కనిపిస్తాడు. అలాగే కెప్టెన్సీని కూడా కూల్ గా చేస్తాడు. గ్రౌండ్ లో ప్లేయర్లపై చిరాకు పడటం లాంటివి అసలు చేయడు. దీంతో ధోనీ కెప్టెన్సీని అందరూ ఇష్టపడతారు.

అయితే కూల్ గా వ్యవహరించే ధోనీ ఈ సారి కాస్త సీరియస్ అయ్యాడు. సీఎస్‌కే బౌలర్ కు క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా పేసర్ తుషార్ దేశ్‌పాండేకు క్లాస్ తీసుకున్నాడు. ఈ యువ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. బౌలింగ్ లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఎక్కువగా నో బాల్స్, వైడ్లు ఇస్తూ భారీగా ఎక్స్ ట్రా పరుగులు ఇస్తున్నాడు. అంతేకాకుండా బౌలింగ్ లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

 

ఈ ఐపీఎల్ లో సీఎస్ కే ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ గా దేశ్ పాండేకు అవకాశం వచ్చింది. కానీ రెండు మ్యాచ్ లలోనూ దేశ్ పాండే ఆకట్టుకోలేకపోయాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో దేశ్ పాండే భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. ఇక ఎక్స్‌ట్రాస్ రూపంలో 7 పరుగులు ఇచ్చాడు. ఇందులో 3 నో బాల్స్ ఉన్నాయి. తొలి ఓవర్ లో 11 పరుగులతో పాటు 3 నోబాల్స్, మూడు వైడ్స్ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ తర్వాత ధోనీ క్లాస్ తీసుకున్నాడు.

 

నో బాల్స్ ఎక్కువ వేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై యువ బౌలర్ దేశ్ పాండేకు కొన్ని సూచనలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -