Dhoni: ప్రపంచంలోనే ఇదే తొలిసారి.. ధోనీకి అరుదైన గౌరవం

Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. వాఖండే స్టేడియంలోని స్టాండ్స్‌లోని ఒక సీటుకు ధోనీ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. 12 సంవత్సరాల క్రితం వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. ఈ సందర్బంగా వన్డే ప్రపంచకప్ రావడంతో కీలకంగా వ్యవహరించిన ధోనీ పేరును ఒక సీటుకు పెట్టాలని నిర్ణయించినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో 91 పరుగులు చేసి ధోనీ నాటౌట్ గా నిలిచాడు. 28 ఏళ్లు తర్వాత టీమిండియాకు వన్డే ప్రపంచకప్ తెప్పించాడు. అయితే చివరిలో ధోనీ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ధోనీ సిక్స్ కొట్టిన సమయంలో బాల్ ఒక సీటుపై పడింది. ఆ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ తెలిపారు. అయితే వాంఖేడే స్టేడియంలో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు కొన్ని స్టాండ్ కు పెట్టారు.

 

అయితే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు స్టాండ్ లోని సీటుకు ఏ క్రికెటర్ పేరు పెట్టలేదు. తొలి ధోనీ పేరును సీటుకు పెడుతుండటంతో.. ఇది విశేషంగా మారింది. ప్రపంచంలోనే ఈ గౌరవం దక్కించుకున్న తొలి క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో ధోనీ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎన్నో ఏళ్లుగా ధోనీ వ్యవహరిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగుసార్లు ఐపీఎల్ కప్ తెప్పించాడు. దీంతో ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ధోనీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇప్పటికీే ఎంతోమంది అభిమానిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -