Sai Tej-Pawan Kalyan: మేనల్లుడికి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Sai Tej-Pawan Kalyan:  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీమేక్ లు చేస్తూ.. హిట్లు దక్కించుకుంటున్నాడు. ఇక ఇదే క్రమంలో తన మేనల్లుడు అయినటువంటి.. సాయి ధరమ్ తేజ్ తో పవన్ ఒక తమిళ సినిమాలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సినిమా పూర్తిగా పక్కన పెట్టేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ వినోదయ సీతం చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు. దీనికి తమిళ దర్శకుడు సముద్రఖని నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ ను పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేయబోతున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తికరంగా ఫీల్ అయినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా అప్పట్లో ఈ సినిమాను త్రివిక్రమ్ కొంతవరకు అప్ డేట్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తామని ఈ చిత్ర బృందం అనుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా పవన్ పొలిటికల్ గా మునిగిపోయాడు.

కనుక పవన్ కళ్యాణ్ తర్వాత చేయబోయే సినిమాలు.. ఏమవుతాయి అన్నదానిపై ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ను ఆపివేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఇక షూటింగ్ లో ఉన్న సినిమాలు కూడా ఆపేయబోతున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం పూర్తిచేయాలని భావిస్తున్నారట. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేనల్లుడు ని పవన్ నిరాశపరిచాడని కొందరు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -