Samantha: రష్మికలా నేను దిగజారిపోలేను.. వైరల్ అవుతున్న సమంత సంచలన వ్యాఖ్యలు!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమా లకు బ్రేక్ ఇచ్చి మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలోనే సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వని ఉన్నట్లు తెలుపుతూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను కమిట్ అయిన సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ ని వెనక్కి ఇవ్వడంతో పాటు తన వద్దకు వస్తున్న సినిమాలన్నీ కూడా రిజెక్ట్ చేస్తూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల టాలీవుడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన బోల్డ్ గా నటించిన యానిమల్ సినిమా ఫస్ట్ పాట వైరల్ గా మారింది. ఈ పాటలో రష్మిక రన్బీర్ తో ఏకంగా లిప్ లాక్స్ లో నటించేసింది. నిజానికి సందీప్ రెడ్డి వంగా ఈ పాత్రలో సమంతను ఊహించుకున్నారట. కానీ ఆమెను అప్రోచ్ అవ్వగా ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. అంతేకాదు అంతలా దిగజారిపోయి నేను నటించలేను అంటూ కూడా తన ఫ్రెండ్స్ వద్ద ఈ పాట చూశాక చెప్పుకొచ్చిందట. ఇప్పుడు అదే పాత్రలో రష్మిక కనిపించడం సంచలనంగా మారింది. పరోక్షకంగా సమంత, రష్మికపై హాట్ కామెంట్స్ చేసినట్లయ్యింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ సామ్ పై ఫైర్ అవుతున్నారు.

గతంలో నువ్వు చేసింది ఏంటి మేడమ్ అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే సమంత స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే.. ఇకపోతే సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత ఒకవైపు మయోసైటిస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూనే విదేశాలలో అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -