Samantha: నాగచైతన్యపై ప్రేమను చంపుకోలేకపోతున్న సమంత.. ఏకంగా అలా చేయడంతో?

Samantha:  సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీ జీవితాల వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలు నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నాయి. తాజాగా నాగచైతన్య సమంతలకు సంబంధించిన ఒక అంశం ఇలాంటి చర్చకే దారితీసింది. సమంత నాగచైతన్య వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత కూడా నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమంత పెట్టిన ఒక పోస్టు మళ్ళీ వైరల్ గా మారింది ఇద్దరి గురించి మాట్లాడుకునే లాగా చేసింది.

లేటెస్ట్ గా సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏమిటంటే ఒక రాబిట్ ఒక పువ్వు పట్టుకొని ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. ఈ ఫ్లవర్ నీకోసమే తెచ్చాను కాకపోతే చిన్న పొరపాటు వల్ల ఈ ఫ్లవర్ పైన కొంచెం తిన్నాను అని చెప్తుంది. ఆ అబ్బాయి నవ్వుతూ పర్వాలేదు ప్రేమ పర్ఫెక్ట్ గా ఉండవలసిన అవసరం లేదు, నిజమైన ప్రేమ ఉంటే చాలు అంటాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత ప్రేమ గురించి ఈ పోస్టు ఇప్పుడు ఎందుకు పెట్టిందంటూ చర్చించుకుంటున్నారు.

అయితే సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటారు. తాను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది తన హ్యాపీనెస్ ని తన సాడ్ నెస్ ని అంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఆమెకి వచ్చిన మయో సైటీస్ వ్యాధి వల్ల కొంతకాలం సినిమాలు కి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని విహారయాత్రలకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆ పర్యటనలో భాగంగా ఆమె అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా పర్యటనను పూర్తి చేసింది. ఆ సమయంలో చాలా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టింది సమంత. అయితే అలాగే ఈ పోస్ట్ కూడా పెట్టిందా లేదంటే చైతన్య మీద ప్రేమని చంపకోలేక ఈ పోస్ట్ పెట్టిందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా విడాకులు తీసుకొని ఇన్ని సంవత్సరాలయినప్పటికీ కూడా ఇంకా ట్రెండింగ్ లో ఉన్న జంట వీరిది మాత్రమే అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -