Bobbili Constituency: హోరాహోరీగా బొబ్బిలి సమరం.. శంబంగి, బేబినాయనలలో గెలుపు ఎవరిదంటే?

Bobbili Constituency: బొబ్బిలి పేరు చెబితేనే మనకు గుర్తుకు వచ్చేది అలనాటి యుద్ధాలనే చెప్పాలి. ఇలా యుద్ధానికి పౌరుషానికి, ప్రతిష్టలకు ప్రత్యేకగా నిలిచినటువంటి బొబ్బిలిలో ఈ ఎన్నికల సమరం భారీగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2024వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలలో కూడా బొబ్బిలిలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడబోతోందని తెలుస్తోంది. ఈసారి జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. అయితే ఈయన 2009, 14, 19 ఎన్నికలలో కూడా గెలపొందారు అయితే ఈసారి కూడా ఇక్కడ ఈయన విజయ కేతనం ఎగరవేయాలని చూస్తున్నారు.

ఇలా ఈయన చేతిలో ఓటమి పాలైన తర్వాత తర్వాత బొబ్బిలి రాజకీయాల నుంచి తప్పుకున్న సుజయ కృష్ణ రంగారావు.. తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు, యువరాజు బేబినాయనకు అప్పగించారు. ఇక ఈ ఎన్నికలలో ఎలాగైనా అధికార పార్టీని ఢీకొట్టి బొబ్బిలిలో పసుపు జెండా నాటాలనే ప్రయత్నాలు బేబీ నాయన చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలపై శంబంగి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత మూడుసార్లుగా నా విజయాన్ని ఎవరు ఆపలేరని ఈసారి కూడా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బేబీ నాయన కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీంతో ఈయన విజయం కూడా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు పెద్దగా అక్కడ సపోర్ట్ లేదని చెప్పాలి. మరి బొబ్బిలిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా అధికార పార్టీకే ఉన్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -