Bobbili: ఈసారి బొబ్బిలిలో వైసీపీకి ఓటమి తప్పదా….! జనసేన మద్దతు కూడా ఉంది….

Bobbili: రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తప్పదనే వాదన బలంగా వినపిస్తుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గంలో సర్వే ఫలితాలు కూడా వెళ్లడయ్యాయి. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని భావంతో జగన్ మోహన్ రెడ్డి కొత్త ఇన్చార్జిలను ప్రకటించుకుంటూ వస్తున్నారు. తాజాగా బొబ్బిలి నియోజకవర్గం కూడా వైసీపీ ఓడిపోయే నియోజకవర్గాల జాబితాలో చేరింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ బొబ్బిలి రాజ కుటుంబానిదే పై చేయి. కానీ గత 2019 ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజుల్లో పెద్ద వాడు సుజయకృష్ణరంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబినాయన ప్రస్తుతం పాలిటిక్స్ లో బాగా యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరపున వచ్చే 2024 ఎన్నికల్లో ఆయనే పోటీ చేయబోతున్నారు.
వైసీపీ తరఫున అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారనే మాట వినిపిస్తుంది.

 

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫు నుంచి సుజయకృష్ణా రంగారావు విజయం సాధించి తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక టిడిపిలో చేరి మంత్రి అయ్యారు.అక్కడ టీడీపీ ఇన్చార్జి గా ఉన్న ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయ సాధించారు.

 

విజయనగరంలో కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. అదే సమయంలో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పైన వ్యతిరేకత కూడా పెరుగుతోంది. బొబ్బిలిరాజులపై గత ఎన్నికల్లో ఓడపోయినా సానుభూతి కూడా కలిసి వచ్చే అంశం
వీటి అన్నిటితో కలిపి ఈసారి బొబ్బిలిలో భారి విజయం సాధిస్తామని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీకి పదిహేను వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు టీడీపీకి కలిసి వస్తుంది కాబట్టి ఈ సారి బొబ్బిలిలో వైసీపీ కి ఓటమి తప్పదనే అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -