Serial Actress: తండ్రి మరణం బాధ నుంచి ఈ హీరోయిన్ అలా బయపటడిందా?

Serial Actress:  వ్యవసాయం.. మనకు అన్నం పెట్టేది, మన కడుపు నింపేది. కానీ దేశంలో వ్యవసాయం చేసే వాళ్ల సంఖ్య అంతకంతకు తగ్గుతోంది. మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో జనాలు కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడే వాళ్లు. ఇప్పుడు వారు పట్నాల బాట పడుతుండటంతో వ్యవసాయం చేసే వాళ్లు తగ్గిపోతున్నారు. అయితే వ్యవసాయం చేయడం వల్ల శారీరక శ్రమ కలుగుతుందని అందరికీ తెలుసు.

 

కానీ ఓ నటి మాత్రం వ్యవసాయం చేయడం వల్ల తాను డిప్రెషన్ నుండి బయటపడ్డట్లు తెలిపింది. తన తండ్రి మరణంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లానని, తర్వాత వ్యవసాయం చేయడంతో దాని నుండి మెల్లిగా బయటపడగలిగానని సదరు నటి వివరిస్తోంది. వ్యవసాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అదే సమయంలో తాను నటనను కూడా వదులుకోనని చెబుతోంది.

 

బిహార్ కు చెందిన రతన్ రాజ్ పుత్ అనే సీరియల్ నటి..తాజాగా పొలంలో పనులు చేస్తూ బిజీగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. 2018లో తన తండ్రి మరణం తర్వాత రతన్ రాజ్ పుత్ డిప్రెషన్ లోకి వెళ్లగా.. ఆమె వ్యవసాయం చేయడం వల్ల దాని నుండి బయటపడిందని వివరించింది. వ్యవసాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని రతన్ రాజ్ పుత్ వివరించింది.

 

హిందీలో ప్రసారమయ్యే పలు టీవీ సీరియల్స్ లో రతన్ రాజ్ పుత్ బాగా పాపులర్ కాగా.. ఆమె 2006లో రావన్ సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘అగ్లే జనమ్ మోహె బితియా హై కిజో’ అనే సీరియల్ ద్వారా రతన్ రాజ్ పుత్ కు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమె ‘మహాభారత్’, ‘సంతోషి మా’ వంటి సీరియల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -