Shah Rukh Khan: స్టార్ హీరో షారుఖ్ సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్.. దేశంలో పరిచయం అవసరం లేని పేరు. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలో కూడా పేరు చెప్తే గుర్తు పట్టేంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఈ బాలీవుడ్ బాద్ షా. అయితే ఈ బాద్ షా తన ప్రస్థానాన్ని కేవలం 10 రూపాయలతో ప్రారంభించాడనే విషయం చాలా మందికి తెలియదు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థాయి నుండి కేవలం పేరు చెప్తే ఈలలు వేసేంత స్థాయికి ఎదిగారు షారుక్. ఇక ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే షారుక్ సక్సెస్ వెనుక కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

 

ఒక సాధారణ వ్యక్తిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్.. చాలా కష్టపడ్డాడు. అవకాశాలను అందిపుచ్చుకుని తనదైన శైలి నటన, మ్యానరిజమ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీ హిట్స్ సినిమాల్లో నటించాడు. తన నటనతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. దానితో ఎవ్వరు ఊహించని పాపులారిటీతో బాలీవుడ్ బాద్ షా గా పేరొందాడు.

 

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..

పది రూపాయలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బాద్ షా.. ప్రస్తుతం పదివేల కోట్లకు ఎదిగారు. ఈయనకు ముంబైలో ఖరీదైన ఇల్లు, ఇతర దేశాల్లో.. లండన్ వంటి ప్రాంతాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి. విలాసవంతమైన ఇల్లు, అపార్ట్మెంట్స్, ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. సినిమాల్లో బాగా సంపాదిస్తున్న షారుక్.. బిజినెస్ లో కూడా బాగా వెనకేస్తున్నాడని టాక్. ఇక తన పేరిట ఓ IPL ఫ్రాంచైజీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం తన క్రేజ్, పాపులారిటీ ఎంతంటే.. ఒక సినిమాకు కోట్లు తీసుకునేంత! అయితే ఆ మధ్య వరుస ఫ్లాప్ లతో అపజయాలు మూటగట్టుకున్నా.. తన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాదు అభిమానులకు తాను అంటే ఆరాధన భావం కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇక త్వరలోనే బాద్ షా పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -