Star Hero: ఆ స్టార్ హీరో మూవీ కాపీనేనా.. అసలేం జరిగిందంటే?

Star Hero: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది క్రియేటివిటీ కలిగినటువంటి దర్శకులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో వేలో సినిమాలను తీస్తూ తమలో ఉన్నటువంటి టాలెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంటారు. ఇలా ఎంతో మంది డైరెక్టర్లు చాలా క్రియేటివిటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే డైరెక్టర్ అట్లీ. ఈయన సినిమాలు కనుక చూస్తే పలానా సినిమా నుంచి ఈ సన్నివేశం తీసుకున్నారా అన్న సందేహాలు కలగక మానదు కట్ చేస్తే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.

ఈ విధంగా ఇదే ఫార్ములా ఉపయోగిస్తూ అట్లీ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందుకోవడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా అందించారు. అయితే తాజాగా ఈయన దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్నటువంటి జవాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

జవాన్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులలో ఎన్నో పాత సినిమాలు గుర్తుకు వచ్చాయి.చివర్లో షారుఖ్ ఖాన్ గుండుని చూసి శివాజీలో రజనీకాంత్ అలా తళుక్కున మెరిసినట్టు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి ఎత్తుకుని జనాలకు చూపించే సీన్ బాహుబలి సినిమాని తలపించింది. అలాగే సగం మొహానికి మాస్క్ ధరించడంతో అపరిచితుడు సినిమాని గుర్తు చేసింది ఇలా పలు సినిమాల కలయికగా ఈ ట్రైలర్ ఉందని చెప్పాలి.

 

అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే కమల్ హాసన్ వంటి స్టార్ హీరో నటించిన ఖైదీ వేటనే సినిమా తప్పకుండా గుర్తుకు రాక మానదు. ఈ సినిమాను అట్లీ జవాన్ గా మార్చాడన్న టాక్ చెన్నై మీడియా వర్గాల్లో ఉంది. భార్య హత్యా నేరం మీద తండ్రి జైలుకి వెళ్లి వస్తాడు. శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఖాకీ చొక్కా వేసుకున్న కొడుకే అడ్డం పడతాడు.జవాన్ సినిమా కూడా ఇదే లైన్ పై కొనసాగుతుందని పలువురు భావిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -