TDP-YSRCP: టీడీపీ, వైసీపీ మధ్య కీలక ఒప్పందం.. ఆ డీల్ కు ఓకే

TDP-YSRCP: అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయంగా విబేధాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు రోజూ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి అసలు పడదు. చివరికి విమర్శలు, ఆరోపణలు వ్యక్తిగతంగా కూడా వెళుతున్నారు. కుటుంబంలోని వ్యక్తులను కూడా రాజకీయ కూపీలోకి లాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరుస్తూ కొడాలి నేని అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆమె లిక్కర్ వ్యాపారాల్లో ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.

దీంతో టీడీపీ నేతలు కూడా విమర్శల దాడి మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడితో పాటు సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి కూడా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు భార్యపై వైసీపీ ఆరోపణలు, జగన్ సతీమణిపై టీడీపీ నేతల ఆరోపణలతో రాజకీయంగా వేడి పెరుగుతోంది. అియితే కుటుంబాల జోలికి రావడంతో ఇటీవల కేబినెట్ సమావేశంలో మంత్రులపై జగన్ సీరియస్ అయ్యారు. తన కుటుంబంపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఎందుకు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాగే సైలెంట్ గా ఉంటూ టీడీపీకి సహకరించేలా ప్రయత్నిస్తే మంత్రి పదవి నుంచి తొలగిస్తామనంటూ హెచ్చరించారు. దీంతో మంత్రులు స్పీడ్ పెంచారు. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమసైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. విమర్శలు, ఆరోపణలు కుటుంబాల వరకు వెళ్లవద్దని ఇరు పార్టీల మధ్య డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. బీఏసీ సమావేశంలో రాజకీయ విమర్శలలోకి కుటుంబాలను లాగడం అంశం ప్రస్తావను వచ్చింది.

ఈ సందర్భంగా భారతిపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల విషయం చర్చకు వచ్చింది. ఫ్యామిలీపై ఆరోపణలు చేయడం సరికాదని, టీడీపీ నేతలు పద్దతి మార్చుకోవాలని జగన్ సూచించారు. అయితే ముందుగా చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలే ఆరోపణలు చేశారని, టీడీపీ శాసనసభ ఉపపక్ష నేత అచ్చెన్నాయుడు తెలిపారు. మీరు విమర్శలు చేయకపోతే తాము చేయమని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో తాము కుటుంబాల జోలికి రామని, మీరు కూడా రావొద్దని అచ్చెన్నాయుడుకి జగన్ చెప్పినట్లు సమాచారం.

దీంతో మీరు చేయకపోతే తాము కూడా కుటుంబాలపై విమర్శలు చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య దీనికి సంబంధించి డీల్ కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని ఒప్పందం కుదురినట్లు చెబుతున్నారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీ అయిన అరబిందో గ్రూప్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అరబిందో గ్రూప్ సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టింది. దీంతో భారతికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -