Womens: గర్భ నిరోధక మాత్రలు వేసుకునే మహిళలకు షాకింగ్ న్యూస్.. అలాంటి సమస్యలు వస్తాయా?

Womens: ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లైన కొత్తజంట ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకొని వారి ఉద్యోగ నిమిత్తం ఎంతో బిజీ అవుతూ ఉంటారు అయితే ఇలా పిల్లలు కాకుండా ఉండటం కోసం గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు వాడటం వల్ల గర్భధారణ జరగడానికి ఆస్కారం ఉండదు కనుక పిల్లలు కూడా కాస్త ఆలస్యంగానే జన్మిస్తారు. అయితే ఈ నిరోధక మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయానికి వస్తే…

గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల గర్భధారణ జరగదు అయితే కొందరిలో ఈ టాబ్లెట్స్ పడకపోవటం వల్ల వివిధ రకాల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల కొందరిలో నెలసరి ఆలస్యం అవుతుంది అలాగే సక్రమంగా నెలసరి రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి, హార్మోన్ ఇన్ బాలన్స్ కారణంగా కొందరు అధిక శరీర బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల కొంతమంది దంపతులలో లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఈ మాత్రలు అందరూ వాడడానికి వీలు లేదు ఎవరైతే కొన్ని వ్యాధులకు దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటారో అలాంటివారు డాక్టర్లను సంప్రదించి వాడటం ఎంతో ఉత్తమం. ఇలా గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడి గర్భం కోసం ప్రయత్నించాలని ఈ మాత్రలు ఆపవేసిన కొంతమందిలో సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది.

ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల కొన్నిసార్లు మహిళలలో రొమ్ము క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుంది అయితే ఇది చాలా తక్కువ మందిలో ఈ లక్షణం కనబడుతుంది కనుక ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడాలి అంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు ఈ నిరోధక మాత్రలు వాడటం ఎంతో మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -