Sashtanga Namaskar: మహిళలు సాష్టాంగ నమస్కారం చేస్తే ఏమవుతోంది?

Sashtanga Namaskar: నమస్కారంలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా.. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు పలకరించుకోవడం మన భారతీయ సంస్కారం. ఈ నమస్కారం ఒక్కొక్క జాతీలో ఒక్కో విధంగా ఉంటుంది. అది వారి వారి సంస్కృతి, సాంప్రదాయలు ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. అయితే నమస్కారంలో భారతీయులకు ఓ ప్రత్యేకత ఉంది. పెద్దవాళ్లను చూసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం అంటారు.

‘నమ’ అంటే కొద్దిగా వండి దండం పెట్టడం. హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేసే పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్లు , రెండు కనులూ భూమిపై ఆన్చి పురుషులు చేయవచ్చు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.

కానీ.. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయ్యటంతో గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి దర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు. ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించివచ్చు. శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి పాటించడంతో స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు ‘పంచాగ నమస్కారాన్ని ‘అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది. మూడేళ్ల క్రితం వ్యాపించిన కరోనా కారణంగా నమస్కారాని ఉన్న విలువ బాగా పెరుగుతోంది. చేతులు కలుపకుండా ఇతర దేశస్తులు సైతం రెండు చేతులు జోడించి సమస్కారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -