Lifestyle: ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా.. ఏం జరిగిందంటే?

Lifestyle: పెళ్లి అంటే రెండు మనసులు కలవడం. రెండు కుటుంబాలు ఒకటి అవ్వడం. అంతేకాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం అని చెప్పవచ్చు. అందుకే పెళ్లి చేసే ముందు వధువు వరుడు తరుపున అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్లి చేయాలి అని అంటూ ఉంటారు. అంతేకాకుండా వధువు వరుడు పుట్టిన నక్షత్రాలను చూసి వారి జాతకాలు చూసి జాతకాలు ఒకటైతాయా లేదా ఇలా అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా అన్ని పర్ఫెక్ట్ గా అనిపించినప్పుడు మాత్రమే పెళ్లిని నిశ్చయిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ అయిపోవడంతో చాలా వరకు ఇలాంటివి పట్టించుకోకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఇవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా పెళ్లి చేసే ముందు చాలా మంది జాతకాలని చూసి ఆ తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే మూలా నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అని చాలా సందర్భాలలో అనడం వినడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి నిజంగానే మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయా? అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా శాస్త్రపరంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన తేదీని పెళ్లి చేసుకుంటే అంత అదృష్టం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు.

 

కానీ చాలామంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నిజానికి అలాంటివేమీ జరగవు. ఒకవేళ కనుక సమస్యలు వస్తున్నాయి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా సమస్యలు రావాలి. పైగా పుట్టిన వాళ్లకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ అపోహలు. కాబట్టి అలాంటి వాటిని నమ్మి మనసు పాడు చేసుకోకూడదు. మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతున్న వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి ఎదుటివారు చెప్పినవి గుడ్డిగా నమ్మకూడదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -