Keerthy Suresh: మహానటి సినిమాలో నటించాల్సింది కీర్తి సురేష్ కాదా.. మరేవరంటే?

Keerthy Suresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు నిర్మాత అశ్విని దత్.ఈయన నిర్మాణంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.తాజాగా ఈయన బ్యానర్ లో వచ్చిన సీతారామం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో నిర్మాత అశ్విని దత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు గురించి ముచ్చటించారు.

ఇకపోతే వైజయంతి మూవీస్ బ్యానర్లు మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. అశ్విని దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా ఈమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు.ఇక ఈ సినిమా గురించి అశ్విని దత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముందుగా ఈ సినిమాలో అనుకున్నది కీర్తి సురేష్ ని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ కన్నా ముందుగా మరొక మలయాళీ హీరోయిన్ ని అనుకున్నాము. అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించడానికి ఆమె పలు కండిషన్స్ పెట్టింది.సావిత్రి పాత్రలో నటించాలంటే తాను ఎలాంటి మద్యం ముట్టుకోనని మద్యం తాగనని కండిషన్స్ పెట్టడంతో తానే స్వయంగా నాగ్ అశ్విన్ తో తనని మార్చమని చెప్పినట్టు ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

ఇకపోతే అశ్విని దత్ ఆ మలయాళీ హీరోయిన్ పేరు ప్రస్తావించకపోయిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కన్నా ముందుగా హీరోయిన్ నిత్యమీనన్ ని ఎంపిక చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక నిత్యామీనన్ సావిత్రి పాత్రలో ఎలా ఉంటారో కూడా కొన్ని ఫోటోలను అప్పట్లో విడుదల చేశారు.ఇలా కండిషన్స్ పెట్టడంతో ఒక గొప్ప సినిమాని నిత్యామీనన్ కోల్పోయారని చెప్పాలి. ఇలా ఈ సినిమా గురించి అశ్విని దత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -