Ashwini Dutt: నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. అలా కామెంట్ చేస్తూ?

Ashwini Dutt: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను ప్రకటిస్తుంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమకు అందించే పురస్కారాలలో నంది అవార్డులు ఎంతో ముఖ్యమైనవి ఒకప్పుడు ప్రభుత్వం నంది అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేస్తూ ఉండేది కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నంది అవార్డులు ఇచ్చే దాఖలాలే లేకుండా పోయాయని పలువురు నంది అవార్డుల గురించి గత కొంతకాలంగా మాట్లాడుతూ ఉన్నారు.

ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీ దత్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏపీ ప్రభుత్వం గురించి నంది అవార్డుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని ప్రేక్షకుల కోరిక మేరకు మే 31వ తేదీ విడుదల చేయబోతున్నామని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మీడియా సమావేశంలో పాల్గొని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వినీ దత్ వైసీపీ ప్రభుత్వం పై సెటైర్స్ వేశారు.

 

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఒకప్పుడు సెలబ్రిటీలకు ఎంతో గౌరవప్రదంగా నంది అవార్డులను ఇచ్చేవారు. ఇలా నంది అవార్డు అందుకునే సెలబ్రిటీలు కూడా వాటిని చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ప్రస్తుతం నడుస్తున్న సీజన్ అంతా ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అంటూ అవార్డులు ఇస్తున్నారు అంటూ ఈయన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.

 

మరొక మూడు సంవత్సరాలు ఆగితే ఎంతో గౌరవప్రదంగా తిరిగి నంది అవార్డులు అందుకోబోతామని అంతవరకు ఎదురు చూడాలి అంటూ అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా అశ్విని దత్ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంటూ పరోక్షంగా ఈయన కామెంట్స్ చేశారని అర్థమవుతుంది. ఇక ఈయన కామెంట్లపై పలువురు స్పందిస్తూ అశ్వినీ దత్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -