Singer Chinmayi Sripada: ప్రెగ్నెన్సీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సింగర్ చిన్మాయ్!

Singer Chinmayi Sripada:  తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సింగర్ గా కంటే సోషల్ మీడియాలో, సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. కాగా సింగర్ చిన్మయి 2014లో నటుడు రాహుల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే సింగర్ చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒకరికి ద్రిప్త అనే మరొకరికి శర్వాస్ అని పేర్లు కూడా పెట్టారట. కాగా కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది చిన్మయి.

తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సినిమా ఇతను ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. నేను రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలి అని ఆశ పడుతున్నాము. ఇక 2020లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నాం కానీ అప్పుడు కరోనాతో అయో మయ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు మా డాక్టర్ కూడా ఇంతకాలం ఎదురు చూశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని జాగ్రత్తలు చెప్పారు అని చెప్పుకొచ్చింది చిన్మయి.

కరోనా సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత నేను గర్భవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం అనగా అబార్షన్ అయ్యింది దీనితో నేను చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది చిన్మయి. ఆ ఘటనతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు ఇంస్టాగ్రామ్ లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ పరిచయమయ్యింది. ఆమె సలహా ద్వారా ఎన్నో రకాల ఎక్సర్సైజ్ లు పాటించాను. ఆ తర్వాత కొంతకాలానికి నేను మళ్ళీ గర్భం దాల్చాను.. కవల పిల్లలకు జన్మనిచ్చాను. 37 ఏళ్ల వయసులో నేను తల్లిని అయ్యాను అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది చిన్మయి శ్రీపాద.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -