Singer Chinmayi Sripada: ఆ విషయాన్ని అసలు పట్టించుకోను… అది నా సమస్య కాదు: చిన్మయి

Singer Chinmayi Sripada: ఇటీవల సరోగసి విషయంపై నయనతార విగ్నేష్ దంపతులు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసింది. నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లి జరిగి నాలుగు నెలలుపూర్తి అయిన వెంటనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామంటూ చేసిన పోస్ట్ తీవ్ర వివాదాలకు కారణమైంది.అయితే వీరు సరోగసి ద్వారా పిల్లలను కన్నారంటూ పెద్ద ఎత్తున వీరి గురించి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే మరోసారి సింగర్ చిన్మయి శ్రీపాద గురించి కూడా వార్తలు రావడంతో ఈ వార్తలపై చిన్మయి స్పందించారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ చిన్మయి కూడా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకుండా ఏకంగా కవల పిల్లల జన్మించారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకోవడంతో వీళ్ళు కూడా సరోగసి విధానం ద్వారా పిల్లలను కన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ విషయం గురించి ప్రస్తావన రావడంతో ఈ వార్తలపై చిన్మయి స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 32 వారాలపాటు తన కడుపులో బిడ్డలను మోసి వారికి జన్మనిచ్చానని తెలిపారు. ఈ క్రమంలోనే తాను గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను సరోగసి ద్వారా పిల్లలను కనలేదని క్లారిటీ ఇచ్చారు.నేను గర్భవతిగా ఉన్న సమయంలో మరికొన్ని ఫోటోలు ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు విచారణ వ్యక్తం చేస్తున్నాను అంటూ ఈమె తెలిపారు.

ఇక తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నాను అలాగే ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నాను. అయితే తన అభ్యర్థన మేరకు ఎవరు కూడా తాను గర్భంతో ఉన్న విషయాన్ని,ఫోటోలను కూడా మీడియా బృందం బయటకు వెల్లడించలేదు అందుకు వారికి ధన్యవాదాలు అంటూ తెలియచేశారు. ఇప్పటికి సరోగసి ద్వారా పిల్లలు నాకు పుట్టారు అనుకుంటే అందుకు నేను ఏమీ చేయలేను.. ఆ విషయాన్ని నేను అసలు పట్టించుకోను. నాపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉన్న అది నా సమస్య కాదు అంటూ ఈ సందర్భంగా ఈమె సరోగసి గురించి క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -