Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి సంచలన వీడియో!

Chinmayi: సింగర్ చిన్మయి..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికీ ఈమె బాగా సుపరిచితమే. సింగర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న చిన్మయి మీటూ ఉద్యమంలో బాగా ధైర్యంగా మాట్లాడి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వేధింపుల గురించి తనతో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా చిన్మయి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆమె తొలి కలయిక మీదుండే అపోహలు, అమ్మాయిలను అబ్బాయిలు ట్రీట్ చేసే విధానం మీద స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనే వర్జిన్ అని, టైట్‌గా ఉంటేనే వర్జిన్ అని అంటుంటారని, అవన్నీ కేవలం అపోహలే అని చిన్మయి తెలిపింది. పెళ్లి కొడుకులు ఇలా ఊహిస్తారని, కానీ రియాల్టీలో ఇలా ఉంటుందని షేర్ చేసిన ట్రోల్ వీడియో మీద చిన్మయి మండి పడింది. వెజినా టైట్‌గా ఉంటేనో, రక్తం కారితేనో, నొప్పి వస్తేనో వర్జిన్ అని అపోహ పడుతుంటారని, కానీ అవన్నీ అబద్దాలని చెప్పుకొచ్చింది చిన్మయి.

 

నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత బాధ, నొప్పి అంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య అని, వెంటనే చికిత్స తీసుకోవాలని చిన్మయి తెలిపింది. ఈమెకు ఆమె షేర్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగర్ చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాహుల్ కూడా సింగర్ చిన్మయి వాఖ్యలను అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -