Siri Hanmanth: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో ఇంత నీచంగా బిహేవ్ చేస్తారా.. అసలేం జరిగిందంటే?

Siri Hanmanth: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. అలాగే ఇందులో నయనతార దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇకపోతే ఇందులో తెలుగు అమ్మాయి సిరి కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరి జవాన్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ… హీరో షారుక్ ఖాన్ తో సినిమా ఆఫర్ వచ్చిందంటే ముందు తను నమ్మలేకపోయాను. కాల్ రాగానే ఎవరో ఫేక్ కాల్ అంటూ నన్ను ఏడిపిస్తున్నారని భావించాను. తర్వాత మా మేనేజర్ కూడా అదే కన్ఫామ్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది సిరి. ముంబైకి ఒక్కదాన్నే వెళ్లాలంటే భయం వేసి శ్రీహాన్ ని తీసుకెళ్లానని తెలిపింది. డైరెక్టర్ నేను కూడా హిందీ అమ్మాయిని అనుకోని ఒక డైలాగ్ సరిగ్గా చెప్పనప్పుడు నా మీద కోప్పడ్డారని అరిచేసారని నేను ఏడ్చేసానని ఆ టైంలో షారుఖ్ ఖాన్ నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ మోటివేట్ చేశారు.

అలాంటి సీన్ నా లైఫ్ లో వస్తుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని అసలు షారుక్ ఖాన్ తో సినిమా నటించడమే గొప్ప అనుకుంటే, ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను మోటివేట్ చేయడం నా లైఫ్ లో మర్చిపోలేని చెప్పుకొచ్చింది. మొత్తానికి అట్లీ సీన్ బాగా రాకపోతే అరుస్తాడు అన్న మేటర్ ని చెప్పకనే చెప్పేసింది సిరి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా సిరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -