Star Actress: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Star Actress: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా అభిమానులకు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలు కనక సోషల్ మీడియాలో ప్రత్యక్షమైతే వాటిని అభిమానులు మరింత వైరల్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నటువంటి హీరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి అంటూ కూడా వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫోటో అలాగే వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలలో చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్గా నటించారు అయితే పవన్ కళ్యాణ్ కి కాకుండా మరొక హీరోకి హీరోయిన్గా నటించారు మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా అదేనండి మీరు ఊహించినదే కరెక్ట్. ఈ ఫోటోలో ఉన్నటువంటి చిన్నారి మరెవరో కాదు నటి సంయుక్త మీనన్.

ఈమె మలయాల చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి కాకుండా రానాకు భార్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈమె ధనుష్ సరసన సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక తాజాగా మెగా హీరో సాయి ధరంతేజ్ నటించినటువంటి విరూపాక్ష సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి ఈమె త్వరలోనే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ చిన్నప్పటి ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -