Sushmita Sen: పాపం లలిత్ మోడీ ఏమైపోవాలి సుస్మిత?

Sushmita Sen: మాజీ ప్రపంచ సుందరి, నటి సుస్మిత సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారగా ఎంతో గుర్తింపు పొందిన ఈమె నాలుగు పదుల వయసు దాటుతున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండటమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు హీరోలతోనూ అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలతోను రిలేషన్ కొనసాగిస్తూ వారితో బ్రేకప్ చెబుతూ వస్తున్నారు.

ఇప్పటికే సుస్మితసేన్ ఏకంగా తొమ్మిది మందితో రిలేషన్ కొనసాగించి ప్రస్తుతం ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నానంటూ గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక లలిత్ మోడీ సైతం సుస్మిత సేన్ తో కలిసి ఎంతో చనవుగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడం కాకుండా ఎంతో మంది నెటిజన్లు ట్రోలింగ్ కి గురయ్యారు.

ఇలా లలిత్ మోడీతో ప్రేమయానం కొనసాగిస్తున్న సుస్మిత ఒక్కసారిగా తన మాజీ ప్రియుడు రోహ్మన్‌ షాతో కలిసి షాపింగ్ లు సినిమాలు అంటూ ఓ రేంజ్ లో తిరుగుతున్నారు. ఈ క్రమంలోని వీరిద్దరూ షాపింగ్ కి వెళ్ళగా అక్కడ కెమెరా కంటపడటంతో ఏకంగా వీరిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇకపోతే సుస్మితసేన్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తన మాజీ ప్రియుడు రోహ్మన్‌ కలిసి షాపింగ్ కి వెళ్లడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇది చూసిన అభిమానులు ఏంటి సుస్మిత అప్పుడే లలిత్ మోడీని వదిలేసావా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక వీరిద్దరూ ఇలా ఫోటోలు దిగడంతో మరికొందరు పాపం లలిత్ మోడీ పరిస్థితి ఏంటో అని కామెంట్లు చేస్తున్నారు అయితే మరి కొందరు మాత్రం సుస్మితసేన్ కు మద్దతు తెలుపుతున్నారు. లవ్ లో బ్రేకప్ వచ్చిన తర్వాత తిరిగి వారిద్దరూ స్నేహితులుగా ఉండకూడదా? ఇలా సుస్మితసేన్ రోహ్మాన్ బ్రేకప్ అనంతరం స్నేహితులుగా ఉన్నారని అలా స్నేహితులుగానే వీరిద్దరూ షాపింగ్ చేశారంటూ మరికొందరు వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా సుస్మిత సేన్ లవ్ బ్రేకప్ అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -