Telugu Desam Party: ఒంటరిపోటీకి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ.. పవన్ దెబ్బకు పూసలు కదులుతున్నాయా?

Telugu Desam Party: ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిపి ఈసారి పోటీ చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. కానీ తాజాగా టీడీపీ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. కాకపోతే ఒంటరి పోటీ అన్నది ఏపీలో కాదు తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగాల్సి ఉంది. ఇందుకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చాలా బిజీగా ఉంటున్నాయి.

119 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో టీడీపీ కూడా అభ్యర్ధులను ఫైనల్ చేయబోతోందంటూ ప్రచారం మొదలైపోయింది. అయితే మొదటి జాబితాగా 30 మంది అభ్యర్థుల పేర్లు కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని చంద్రబాబు లేదా తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజే చెప్పాలి. సరే జాబితాలోని పేర్లు, నియోజకవర్గాల మాట ఎలా ఉన్నా ఒంటరి పోటీ అయితే దాదాపు ఖాయమన్నట్లే. ఇప్పటికే కాసాని మీడియాతో మాట్లాడినపుడల్లా టీడీపీ ఒంటరి పోటీకి రెడీ అవుతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు.

 

ఇందులో భాగంగానే ఖమ్మం, నిజామాబాద్, కుకట్ పల్లి, నిజాంపేట, ఎల్బీనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే విషయమై ఒకటికి రెండుసార్లు సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఇదే సమయంలో గట్టి అభ్యర్థులను కూడా రెడీ చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి సాలిడ్ గా సగటున 5 వేల ఓట్లుంటాయి. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంకా ఎక్కువ ఓట్లే ఉంటాయి. అయితే నిజానికి ఉన్న ఓట్లతో టీడీపీ ఎక్కడా గెలవదని అందరికీ తెలుసు. అయితే టీడీపీ గెలవకపోయినా ప్రత్యర్ధుల్లో ఎవరో ఒకళ్ళ ఓటమికి మాత్రం కారణమవుతుంది. ఈ విషయంలోనే మిగిలిన పార్టీలు టీడీపీ ఓటుబ్యాంకుపై కన్నేశాయి. అలాగని టీడీపీతో పొత్తుకు ఏ పార్టీ కూడా ముందుకు రావటంలేదు. ఒకపుడు బీజేపీతో టీడీపీకి పొత్తుంటుందనే ప్రచారం జరిగినా తర్వాత ఎందుకో అది ముందుకు వెళ్ళలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ దెబ్బకు పూసలు కదులుతున్నాయా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -