Diwali: దీపావళి ఆ సమయానికే చేయాలట!

Diwali: దీపావళి పండుగ జీవితాలలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగను హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళికి ఒక విశేషమైన స్థానం ఉంది. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలోదీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంధకారాన్ని తొలగించి వెలుగులను తీసుకువచ్చే సంకేతంగా భావిస్తారు.

దీపావళి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దీవాలి అని , దీపావళి అని పిలుస్తారు. దీపావళి పండుగనాడు అందరూ ఇల్లంతా దీపాలను వెలిగించి సంపదకు, అదృష్టానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

దీపావళి పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసి ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను బయటకు పంపి, సానుకూల శక్తిని ఇంటిలోకి ఆహ్వానించి ఆపై ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆపై లక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. దీపావళి పండుగ అంటేనే సరదా పండుగ. కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. బాణాసంచా ప్రకాశాలతో, దీపాల వెలుగులతోఅందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జరుపుకునే పండుగ దీపావళి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -