Election Commission: ఎన్నికల కమిషన్ ఆదేశాలను సైతం పట్టించుకోని ఏపీ అధికారులు.. మరీ ఇంత ఘోరమా?

Election Commission: గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వైసీపీ ప్రధాని ప్రత్యర్థి అయిన టీడీపీ ఒంటరి పోరు చేయడం.. టీడీపీకి వ్యతిరేకంగా జనసేన కూడా స్వరం పెంచడం.. దీంతో టీడీపీ ఓట్లు చీలడం వంటివి జరిగాయి. దీనికితోడు కేంద్రం నుంచి మోడీ, పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ అండదండలు జగన్‌కి పుష్కలంగానే ఉందాయి. దీంతో.. జగన్ గెలుపు సునాయాసమే అని ఎన్నికల ముందే అంతా ఊహించారు. అయినా.. గత ఎన్నికల్లో వైసీపీ ఎక్కడా ఛాన్స్ తీసుకోలేదు. అనుమానం ఉన్న చోట అరాచకాలు చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున సత్తెనెపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాద్ ను పోలింగ్ రోజున వెంటాడి వెంటాడి దాడి చేశారు. కారుతో తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. వందలమంది వెంటాడి దాడి చేశారు. గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తే… గెలుపు కష్టమే అనుకున్న రోజు.. ఎలాగైనా గెలవడం కోసం ఎన్ని అరాచకాలకు తెగబడతారో ఊహించలేం.

ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న అంశాలు అన్ని ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. మోడీ, పవన్.. చంద్రబాబుతో ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ ఓటమి కోసం పావులు కదుపుతుంది. రాయలసీమను ఆనుకొని ఉన్న కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాబట్టి వైసీపీకి నిధులు వచ్చే మార్గాలు తగ్గిపోయాయి. అందుకే వైసీపీ నేతలకు దాడులకు తెగబడతున్నారు. వైసీపీ ఆగడాలకు అధికారులు వస్తాసు పలుకుతున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు ఏమాత్రం తగ్గడంలేదు. వైసీపీ చేతిలోనే అధికారం ఉందని అనుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఈసీనే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఈసీదే ఫైనల్ డెసిషన్. కానీ, అధికారులు మాత్రం తామే ఫైనల్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సీఎస్ జవహార్ రెడ్డి ఎన్నికలపై సమీక్షలు చేస్తున్నారు. ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. వైసీపీ నేతల అండతో అధికారులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల నిబంధనల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో వైసీపీకి చెందిన బ్యానర్లు ఉన్నా.. పట్టించుకోని అధికారులు..

టీడీపీ నేతల ఇళ్ల దగ్గర వారి బ్యానర్లు ఉంటే తొలగిస్తున్నారు. సీఈఓ మీనా ఆదేశాలను పక్కన పెట్టి.. తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పని చేస్తున్నారు. సీఈఓ ఆదేశించినా.. ఓ కలెక్టర్ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించలేదు. దీనిపై సీఈఓ ప్రశ్నిస్తే.. కింది అధికారులకు చెప్పా.. వారు తొలగించలేదని కలెక్టర్ సమాధానం చెప్పారట. ఇది ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు తీరు. రాష్ట్ర స్థాయి అధికారి అయిన సీఈఓ పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాష్ట్రవ్యప్తంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోడ్ అమల్లోకి వచ్చిన రోజే.. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైయ్యారు. దానిపై కేసులు నమోదయ్యాయా? ఎంత వరకు వచ్చాయి అనేదానిపై ఇంతవరకూ సమాచారం లేదు.

ప్రధాని మోడీ సభలోనే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓ రెడ్డి అధికారిని నియమించి కావాలని ఆ పరిస్థితిని సృష్టించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దానిపై ఇంత వరకూ సమాచారం లేదు. చివరికి ఈ అంశంలో ఐబీ నివేదికపై ఆధార పడాల్సి వస్తుంది. ఈసీ అధికారులు కూడా మెతక వైఖరి ప్రదర్శిస్తే ఇక అంతే వైసీపీ అరాచకాలకు అంతే ఉండదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -