MLC: ఘోరంగా ఆ ఎమ్మెల్సీ పరిస్థితి.. అచ్చెన్నను ఢీ కొట్టడం సాధ్యమా?

MLC: ఎన్నికలకు మరొక ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి.ఈ క్రమంలోనే ఎవరికి ఏ ప్రాంతంలో టికెట్ ఇస్తున్నారు లేదు అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు జగన్ పై కోపంతో కూడా ఉన్నారని తెలుస్తుంది అయితే ప్రస్తుత పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈసారి అచ్చం నాయుడుకు పోటీగా ఎన్నికల బరిలో దిగిపోతున్నారు.

ఎలాగైనా అచ్చం నాయుడుని ఓడించాలన్న నేపథ్యంలోనే జగన్ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో టికెట్ కన్ఫామ్ చేసినట్లు తాజాగా జగన్ బహిరంగంగా ప్రకటించారు. అయితే జగన్ తనని ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలోని వైసిపి నేతల సపోర్ట్ దువ్వాడ శ్రీనివాస్ కి లేదని తెలుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కిల్లి కృపారాణి, కాలింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ఈ ముగ్గురు మూడు వర్గాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

కిల్లి కృపారాణి ఎప్పటినుంచో అధికారం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈమెకు అందరి ద్రాక్ష లాగే మారిపోతుంది తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఏమాత్రం మద్దతు తెలిపే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇక తిలక్ కి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం సంతృప్తిగా లేరని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరిని కాదని దువ్వాడ శ్రీనివాస్ ను అచ్చం నాయుడు పై పోటీకి దింపుతున్నారు.

 

ఇల స్థానికంగా వైఎస్ఆర్సిపి నాయకుల సపోర్ట్ దువ్వాడ శ్రీనివాస్ కు లేదని కేవలం జగన్ మాత్రమే ఆయనను నమ్మి అచ్చం నాయుడుతో పోటీకి దింపబోతున్నారని తెలుస్తుంది. మరి అచ్చం నాయుడు పోటీపై దువ్వాడ శ్రీనివాస్ గెలుపు ఖాయమవుతుందా లేక జగన్ నమ్మకం నీరు కారిపోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ కు స్థానిక నేతల మద్దతు లేకపోవడం ఎంతో బాధాకరమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -